Full width home advertisement

Post Page Advertisement [Top]

పల్లె కన్నీరు పెడుతుందొ కనిపించని కుట్రల



పల్లె కన్నీరు పెడుతుందొ కనిపించని కుట్రల 
నా తల్లీ బంధి ఇపొతుందొ కనిపించని కుట్రల  
కుమ్మరి వామిలొ తుమ్మలు మొలిసెను   
కమ్మరి కొలిమిలొ ధుమ్ము పెరెను
పెద్ద బాడిస మొద్దు బారినది  
సాలెల మగ్గం సడుగులిరిగినది 
చేతి గుర్తుల చెతులిరిగిపాయె నా పల్లెల్లొన 
అయ్యొ గ్రామ స్వరాజ్యం గంగలొన పాయె ఈ దేశంలొన  

మదుగులన్ని అడుగంటి పొయినవి   
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు యెండిపొయినవి 
సాకలి పొయ్యిలు కూలిపొయినవి
పెద్ద బొరు పొద్దంత నడుస్తొందో బలిసీన దొరలది   
మరి పేద రైతుల బావులెందుకెండె నా పల్లెల్లొన   

ఈదులన్ని వొత్తి మొద్దులయ్యినవి  
ఈత కల్లు బంగారవయ్యినది 
మందు కలిపిన కల్లును తాగిన 
మంది కండ్ల నిండూసులయ్యినవి   
చల్లని బీరు విస్కి  లెవదు పంపె నా పల్లెల్లొకి   
అరె బుస్సున పొంగె పెప్సి కోల వచ్చె నా పల్లెల్లొకి  
పల్లె కన్నీరు పెడుతుందొ కనిపించని కుట్రల 
నా తల్లీ బంధి ఇపొతుందొ కనిపించని కుట్రల   
పరక సాపలకు గాలలేసే  
తురక పొరలు యాడికిపొయిరి  
లారిలల్లొ క్లీనర్లయ్యిర  పెట్రోల్ మురికల మురికయ్యిన్ర   
తల్లి థూదు సెమియకు దూరమయ్యినార సాయబులా పోరలు  
ఆ బేకరి కేఫుల ఆకలి తీరిందా ఆ పట్టనాలలొ     

పల్లె కన్నీరు పెడుతుందొ కనిపించని కుట్రల 
నా తల్లీ బంధి ఇపొతుందొ కనిపించని కుట్రల

పరకాల పనికి ఆకలి తీరక ......ఫర్నిచర్ పని ఎతుకుంటూ ఆ పట్నం పోయిన విశ్వ కర్మలు
ఆసామోలంతా కుర్చోనేటి వడ్రంగుల వాకిలి నేడు
పొక్కిలి వేసి దోక్కిస్తునదిరూ నా పల్లెల్లోనా ..మేరోలాస్సే తూర కతేర మూల పోయి సిలువేక్కి పోయినది కుట్టుడు రెక్కల బనేల్లు పోయినవి జోడు లాగులు జాడకె లేవు
...వెడే వెడే ఫాషన్ దుస్తులోచ్చేనంటా నా పల్లె పొలిమేరకు ..ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోనా

పల్లె కన్నీరు పెడుతున్దూ కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ,,

నారా కెంపు తెల్లలు జెల్లలు పరులకి తెలియని మరుగు బాషతో బేరం తీసే కంసాల వీధులు వన్నె తగ్గినవి చిన్న బోయినవి ..చెన్నై బొంబాయి కంపెనీ నగలోచ్చీ మన స్వర్ణ కారుల ..అరె సెన్నతాలులై తరుముతున్నయీడ నా పల్లెల నుండి .....మాధిగలొక్కి నోరు తెరిచినది తంగేడు చెక్క బంగా పడ్డది తొండముగోక్కిన నిండా మునిగనది ఆరేలంప పదునారిపోయినది ...పాత రేకువలె మోతలు మొగేటీ ప్లాస్టిక్కు డప్పులు ..నా మేతని డప్పును పాతరేసే కదరా నా పల్లెల్లోన ...కుంకుమ దాసిన బుగ్గ మీద
కంపెనీ రక్కసి కన్ను పడ్డది పూసలోల్ల తాళాము కప్పలు కాశిలొగలిసి కవవైతునవి ...బొట్టు బిళ్ళను మోసటికొచ్చే కదరా నా పల్లెలు కుడా.. మన బుడ్డి దాసరి బతుకులాగమాయె ఈ పల్లెల్లోన ....

పల్లె కన్నీరు పెడుతున్దూ కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ,,

ఇల్లు గట్టుకుని ఇటుకోక రాయోక సిలకల జల్లే ఎరువుకుళ్ళుతో ఎద్దు బండి ఉన్నోడి చేతికి ఏడాదంతా పని దొరికేది ..టాటా ట్రాక్టరు తక్కరిచినాదూ నా డొక్కా దారిని..నా ఎదు బండిగిల్లెగిరి పడ్డ దమ్మొ నా పల్లెల్లోనా..
తొలకరి జల్లుకి తడిచిన నెల మట్టి పరిమలాలెమైపొయిర వానపాములు నతగుల్లలు భూమిలో ఎందుకు బతుకుతలేవే ..పత్తి మందుల గాత్ర వాసనరా ఈ పంట పొలాలల ...ఆ మిద్ధికి తెచిన అప్పే కట్టాయే నా రైతు గుతికపై ... ..హరిచంద్రమతే నాటకాలు వదు నారుఒరియమ్ చెదలు పట్టినది యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్ట పట్టినాడు ...యాచకాలు నా బుడగ సంగాలు ఈ పల్లెలనిడిసి......దేవా..హరిహరా ...యాచకాలు నా బుడగ సంగాలు ఈ పల్లెలనిడిసి...ఆ పాత బట్టల మూటలమ్ముతుండురా..తమ పొట్ట కూటికై...


పల్లె కన్నీరు పెడుతున్దూ కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ,,

తిన్దోలెన్నల రాలుచుండగా రచబండపై కూసుని ఊరే ఎనకటి సూక్తులు యధాలు కథలు యాది చేస్కుని బాధలే మరిచిరి ...గుక్క నోటిలో పద్దదంటే మన పల్లెల్లోన అయ్యో ఒక్కడు రాతిరి బయటకేల్లడంమో ఇది ఏమి సిత్రమో ...బతుకమ్మా తోలాట పాటలు బజానా కీర్తనలు మద్దేరా మోతలు బైరాగుల కిన్నేరతత్వమ్ములు కనుమరుగాయేర నా పల్లెల్లో ...స్టారు టీవీ సిగలు( సిగ్నల్;) ఇస్థున్నధమ్మొ నా పల్లెల్లోనా..సామ్రాజ్యవాధ విష మేక్కుతున్నదమ్మొ మెల్లంగ పల్లెకు ,,,,.. వృత్తులు / వృద్ధులు కూలే ఉపాధి పోయే ప్రత్యామ్నాయం లేకకపోయే..కూలిక బ్రతుకులు
నిలుపుటకైన కుటీర పరిస్రమనైనా పెట్టరు...అరె బహుళజాతి
కంపెనీల మాయలోనా మా అన్నల్లారా ,,భారత పల్లెలు నలిగిపోయే కుమిలే ఓ అయ్యల్లారా ...


పల్లె కన్నీరు పెడుతున్దూ కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ,,పల్లె కన్నీరు పెడుతుందొ కనిపించని కుట్రల

మీ గోరటి వెంకన్న 

6 కామెంట్‌లు:

 1. Your blog is added to http://telanganablogs.org. Please visit the indexor and see other Telangana blogs.

  రిప్లయితొలగించు
 2. నిర్వీర్యమైపోయిన పల్లె వ్యవస్ధ యొక్క దీనస్ధితిని కళ్ళకి కట్టినట్లు చూపించే పాట.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అవును , పరిస్థితి ఇప్పుడన్న మార్తదేమో సూడాలె. ఇంకా మీకు తెలిసిన పాటలు ఎమైనా ఉంటె చెప్పుర్రి సార్, ఈడ పెడదాం.

   తొలగించు
 3. రిప్లయిలు
  1. నమస్తే లోకేష్ శ్రీకాంత్ భాయ్, నీకు తెలిసిన మన మంచి పాటలు ఓ రెండు జెప్పరాదు.

   తొలగించు

Bottom Ad [Post Page]