మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • తెలంగాణ భాష - బంగారి యాస

  తెలంగాణ భాష - బంగారి యాస

  తెలంగాణ భాష.. ఇది తేనె చిందే భాష.. బతుకమ్మల తంగెడు పూల బంగారి యాస.. అంటూ తెలంగాణ భాష, సంస్కృతుల వైభవాన్ని చెబుతూ కొత్త పాట రాశారు డాక్టర్ కందికొండ.పోతన నుండి కాళన్న వరకు, సిద్దప్ప నుండి వట్టికోట ఆళ్వార్ స్వామి, వానమామలై, సినారె వరకుతెలంగాణ సాహితీ దిగ్గజాలందరికీ కందికొండ పాట అద్దంపట్టింది. భాష, సాహిత్యాలతో పాటు మన సంస్కృతిలో భాగమైన బతుకమ్మ, బోనాలు, మేడారం జాతర, పీర్లు, గుస్సాడి వంటి జాతరల విశిష్టతను వివరించారు.గీత రచయిత కందికొండ రాసిన పాట మీకోసం.
  కింద పాట తెలుగుల ఉన్నది, సదువుర్రి.  తెలంగాణ భాష, ఇది తేనె చిందె భాష, బతుకమ్మల తంగెడు పూల బంగారి యాస
  తెలంగాణ భాష, ఇది తేట సెలిమె ఊట
  జమ్మి చెట్టు, యెలుగు జల్లె జానపదుల శ్వాస

  రెలారే  రెలారే  రెలారే రేల రేల రే
  రెలారే  రెలారే  రెలారే రేలా రేలా రేలా రే

  పాల్కురికి పోతన దాశరధి కాలోజీ కలం నుండి జారినట్టి కమ్మని భాష
  హొ వట్టికోట వరధాచార్య సిద్దప్ప సినారే గళం నుండి ఒలికినట్టి తియ్యని భాష
  బానిసత్వ బతుకునే, తరిమికొట్ట కలం బట్టి బరిగీసి లడాయికీ దిగింది భాష
  ముల్కి పోరు గానమై, సకల జన నినాదమై కొట్లాటకు దిగిన కోట్ల గొంతుల భాష
  రక్తానికి వేడిని, కలానికి వాఢిని అందించిన అగ్గిలాంటి ఉద్యమ భాష

  తెలంగాణ భాష, ఇది తేనె చిందె భాష, బతుకమ్మల తంగెడు పూల బంగారి యాస
  తెలంగాణ భాష, ఇది తేట సెలిమె ఊట
  జమ్మి చెట్టు, యెలుగు జల్లె జానపదుల శ్వాస

  హా ముప్పైఒక్క జిల్లాల ముద్దు ముద్దు మాటలు, వచ్చిండని, అచ్చిండని పలుకులు
  ఓ మెరిసే బోనాలు, విరిసే బతుకమ్మలు కాముడాట కోలాటపు పాటలు
  హో గుస్సాడి ఆటలు, లంబాడి తీజులు, మేడారం సమ్మక్క  జాతరలు
  హో గల గల గల సిరి నదులై, పచ్చ పచ్చని మాగానులై యాధాద్రి, కొమురవెల్లి కోవెలలై
  అహొ సింగరేణి సైరనై, సిరిసిల్ల మగ్గమై, సింగూరు నీటి తడై తాకిన భాష
  రక్తానికి వేడిని, కలానికి వాఢిని అందించిన అగ్గిలాంటి ఉద్యమ భాష

  తెలంగాణ భాష, ఇది తేనె చిందె భాష, బతుకమ్మల తంగెడు పూల బంగారి యాస
  తెలంగాణ భాష, ఇది తేట సెలిమె ఊట
  జమ్మి చెట్టు, యెలుగు జల్లె జానపదుల శ్వాస

  మా అవ్వ పాలధారతో, అల్లుకున్న భాషలో చినుకు పడితె మట్టి చిందె వాసనలు
  ఓ చిందు ఒగ్గు పీరీలు, పోతరాజు ఆటలు, శివసత్తులు రంగం లో రాగాలు
  హో పోరాట పాటలు, చల్ పోట్లాడె ఆటలు, ఆయుధమై అక్షరమై నేర్పెను
  ఓ కాకతీయుల గుండె ధైర్యమై, గోలుకొండ పాపన్న శౌర్యమై పాలపిట్ట పలికేటి పలుకులై
  ఓ తెలంగాణ పుడమిపై, సాహిచ్య అకాడమై తలయెత్తిన తల్లి తెలంగాణ భాష
  అహొ సింగరేణి సైరనై, సిరిసిల్ల మగ్గమై, సింగూరు నీటి తడై తాకిన భాష
  రక్తానికి వేడిని, కలానికి వాఢిని అందించిన అగ్గిలాంటి ఉద్యమ భాష

  తెలంగాణ భాష, ఇది తేనె చిందె భాష, బతుకమ్మల తంగెడు పూల బంగారి యాస
  తెలంగాణ భాష, ఇది తేట సెలిమె ఊట
  జమ్మి చెట్టు, యెలుగు జల్లె జానపదుల శ్వాస

  రెలారే  రెలారే  రెలారే రేల రేల రే
  రెలారే  రెలారే  రెలారే రేలా రేలా రేలా రే

  రచన - డా.కందికొండ  
  సంగీతం - భోలే షావలి  
  గానం - భోలే షావలి

 • You might also like