మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • మాయమై పోతున్నడమ్మా ... మనిషన్న వాడు by Dr. Andhe Sri  మాయమై పోతున్నడమ్మా ... మనిషన్న వాడు 
  ఓ ఓ ఓ ...  మచ్చుకైనా లేడు... చూడు
  మానవత్వము ఉన్నవాడు

  నూటికో...  కోటికో...  ఒక్కడే ఒక్కడు
  యాడ ఉన్నాడో కాని... కంటికి కనరాడు

  ॥ మాయమై... ॥

  నిలువెత్తు స్వార్ధము ...  నీడలా వస్తుంటే...  చెడిపోక ఏమైతడమ్మా
  ఆత్మీయ బంధాల అప్రేమ సమ్మన్దాల...  దిగజారుతున్నడోయమ్మా
  అవినీతి  పెనుఆశ అందకారము లోన...  చిక్కిపోయి రోజు శిదిలమౌతున్నాడు
  ॥ మాయమై... ॥
    
  కుక్క నక్కల దైవ రూపాలుగ గొలిసి...  పంది నందిని జూస్తె  పడి మొక్కుతుంటాడు
  సీమలకు చెక్కర పాములకు పాలోసి...  జీవకారున్యమే జీవితము అంటాడు
  తోడ బుట్టిన వాళ్ళ ఊరౌతలకి నెట్టి... కుల పద్దు ఇలమీద కలహాల గిరిగీసి
  ॥ మాయమై... ॥

  ఆధ్యాత్మికతకున్న అర్ధమే తెలియక...  అంధుడై పోతున్నడమ్మా
  హిందు ముస్లిము క్రీస్తు సిక్కు పార్సీ నంటూ...  తనను తా మరిచెనోయమ్మ
  మతములోకయితము అన్థమార్ధమరిసి...  మత ఘర్షణల మధ్య మనిసి కనుమరుగవుతు
  ॥ మాయమై... ॥

  ఇరువై అయిదు పైసల అగరువత్తీలు  గాల్చి...  అరవై ఐదు కోట్ల వరము లడుగుతాడు
  దైవాల పేరుతో  చందాల కై దంద ... భక్తి ముసుగు తొడిగి భలే ఫోజు వెడుతాడు
  ముక్తి పేర నరులు రక్తి లో రాజయ్యి...  రాకాసి రూపాన రంజిల్లి లోకాన
  ॥ మాయమై... ॥

  అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి... సుట్టు దిరుగూతున్నడమ్మా
  రూపాయి కొరకు ఏ పాపానికైతేమి...  ఒడిగట్టే నదిగొచూడమ్మ
  కోటి విద్యలు కూటి కోసమన్నది వోయి...  కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి
  ॥ మాయమై... ॥

  కండ్ల పొరలు కమ్మి కామముతో రేగి...  వెకిలి సాస్టల తోటి వేదిస్తు ఉన్నాడు
  కన్నవాల్లకు రోజు కన్నీల్లె మిగిలించి ...  కౌగిలే స్వర్గ మని కలలు గంటున్నాడు
  సీకటైతె జాలు... చిత్తుగా తాగేసి... వావి వరసలు కాస్తా... మరిచి పోతూ నరుడు
  ॥ మాయమై... ॥

  పార్టి సిద్దాంతాల... పరగణాల... గొడవలోన పడి  చస్తున్నడమ్మా
  ఆదిపత్యపు పోరు అలజడి... చిరునామా అంటూ జై కొడుతున్నడమ్మా
  రాజకీయలల్లొ రాటు దేలి తుదకు ... మానవత విలువల్ని... మంటగలుపుకుంట
  ॥ మాయమై... ॥

  ఇనుప రెక్కల డేగ విసిరినా  పంజాకు...  కోడి పిల్లై  చిక్కి కొట్టుకుంటున్నాడు
  పుట్టికి స్వర్గాని కందకుండగ తుదకు...  అస్తిపంజరమై  అగుపించనున్నాడు
  కదిలే విశ్వము తన ... కనుసన్నలో నడుమ...  కనుబొమ్మ లెగిరేసి...  కాలగమనములోన

  మాయమై పోతున్నడమ్మా ... మనిషన్న వాడు 
  ఓ ఓ ఓ ...  మచ్చుకైనా లేడు... చూడు
  మానవత్వము ఉన్నవాడు

  నూటికో  కోటికో...  ఒక్కడే ఒక్కడు
  యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు

  మాయమై పోతున్నడమ్మా ... మనిషన్న వాడు 
  ఓ ఓ ఓ ...  మచ్చుకైనా లేడు... చూడు
  మానవత్వము ఉన్నవాడు

 • You might also like

  2 వ్యాఖ్యలు: