Full width home advertisement

Post Page Advertisement [Top]

ఓ ఊల్లె ఒక అందమైన బావ మరదలు జంట, మరదలి కేమో పట్నం బోవాలని ఉంది, అది బావకి చెప్తే ఎం అంటుండో సూడుర్రి




మర్దలు : హోయ్! పల్లె విడిచి పట్నం పోదాం పావయ్యో  ఓ  బావయ్యో

హోయ్! పల్లె విడిచి పట్నం పోదాం పావయ్యో   ఓ  బావయ్యో
మనము కూలో నాలో చేసుకుందాం పావయ్యో   ఓ  బావయ్యో

బావ :  మాయదారి పట్నం జోలికి రానమ్మో ఓ రాధమ్మ

మాయదారి పట్నం జోలికి రానమ్మో ఓ రాధమ్మ
మాయ జంతర్ మంతర్ పట్నం జోలికి రానమ్మో ఓ రాధమ్మ

మర్దలు :  ఎహె? ఇక్కడ నీకు ఏమున్నాది పొక్కలు పడ్డ గుడిసె తప్ప
బుక్కెడు బువ్వే కాదు కసికెడు నీళ్లు కూడా కరువేనప్పా

ఏ కుండపట్టుకొని నీళ్ల కోసం వాగులు  ఒర్రెలు తిరిగి తిరిగి
కొందలపోయ్యే రోజులు వచ్చే ఇంకొద్దూ ఈ పల్లె బతుకు

పల్లె విడిచి పట్నం పోదాం పావయ్యో   ఓ  బావయ్యో

బావ :  ఎహె దూరపు కొండలు మునుపే గాని జారుడు బండలు గావే పోరి
లష్కరు  రోడ్ల మీద నల్లా కాడ మొగోళ్ళు ఆడోళ్ళంతా

అరే  బిందెడు నీళ్లకు లైను గట్టి నిలబడి నిలబడి సచ్చిన గాని గిలాస నీళ్లు దొర్కక  వాళ్లు పైసలు పెట్టి కోట్రాన్రంట!

మాయదారి పట్నం జోలికి రానమ్మో ఓ రాధమ్మ

మర్దలు : ఎహె పల్లె విడిచి పట్నం పోదాం పావయ్యో   ఓ  బావయ్యో

రొట్టెలు చేసే పెంచుల్లెక్క  జారే వెడల్పు రోడ్లుంటాయి
ఫాక్టరీల్లోన  మన ఇద్దరికీ పని దొరికిందా రందేలేదు

చితికి మాటికీ సిటీ బస్సులు కాలి  నడకల కర్మే  లేదు
పౌడరేసుకుని సందె నాడు సినిమా చూసి షికారు కొడదాం

పల్లె విడిచి పట్నం పోదాం పావయ్యో   ఓ  బావయ్యో

బావ :  అరె  ఉల్టా పల్టా కర్సులు గల్లీ గల్లీ  కళ్ళు బ్రాందీ షాపులు
లేని పోని  సోకులు మనకు అలవాటైతై  వద్దే  పిల్ల

అరె సుక్క సుక్క వాన నీళ్లు భూమిల ఇంకే టట్టు చేసి
జలాలు పెంచి పొలాలు దున్ని మళ్లి  పాడి పంటలు దీద్దాం

మాయదారి పట్నం జోలికి రానమ్మో ఓ రాధమ్మ

మర్దలు :అవును పల్లెలోన  సల్లంగుందాం రావయ్యో ఓ  బావయ్యో

బావ : మాయదారి పట్నం జోలికి రానమ్మో ఓ రాధమ్మ

మర్దలు : మనము పల్లెలోన  సల్లంగుందాం రావయ్యో ఓ  బావయ్యో

అదోం  తకిట దిమి తక దిమి తక దిమి థ





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]