మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • నేలమ్మా నీకు వేల వందనాలమ్మా


  నేలమ్మా  నీకు  వేల వందనాలమ్మా

  నేలమ్మా….! 
  నేలమ్మా…..!
  నేలమ్మ నేలమ్మ నేలమ్మ 
  నీకు వేల వేల వందనాలమ్మా   | 3 | 
  సాలేటి వానకి తుల్లింతా 
  ఇంకా సాలు సాలుకి నువ్వు బాలింతా
  గాలినే  ఉయ్యాలగా 
  నీళ్లనే  చనుబాలుగా 
  పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు
  సక్కంగా మోసేవు మొక్కల్లా
  పరువమోచ్చి సేను వంగే 
  పైరు కాపు మేను  పొంగే   
  పంట బిడ్డను రైతు బండికెత్తినంక 
  పగిలిపోతుందమ్మ  నీ కన్న కడుపింక
  నేలమ్మ నేలమ్మ నేలమ్మ 
  నీకు వేల వేల వందనాలమ్మా
  తల్లి నువ్వు నవ్వితె మాగాణి 
  ఎద తలుపు తీశావంటె సింగరేణి 
  తనువునె తవ్వి తీసిన 
  మనసునే తొలి చేసినా  
  పొట్ట తిప్పలకు  బిడ్డలు 
  నీ పొట్టలో పడుతున్న తిప్పలు 
  ఏఏ రోజుకారోజు తీరి 
  నూరేళ్ళ అయ్యుస్సుకోరి 
  కడుపులో తిరిగేటి కొడుకుల కై నువ్వు  
  తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ
  నేలమ్మ నేలమ్మ నేలమ్మ 
  నీకు వేల వేల వందనాలమ్మా
  తైలాలు పూసింది నైలు నది 
  నీకు తలస్నానమయ్యింది గంగ నది
  గంధమే పూసిందహో 
  పొందుగా ఓ యాంగుహో 
  కొండలల్లో రంగు రంగుపూలు 
  గండు కోయిలలు నైటింగేలూ 
  కొలువైనద వెండి కొండా 
  నీ జాలి గుండెల్లో  జెండా 
  ఎన్ని ఉనన్నా  మనిషి కన్నీళ్లు రక్తాలు 
  కనుల కనలేక కంపించి పోతావు
  నేలమ్మ నేలమ్మ నేలమ్మ 
  నీకు వేల వేల వందనాలమ్మా
  మాతల్లి నీ మట్టి బంగారం 
  అది మానవాళికి నుదుట సింధూరం 
  అమ్మా నీ అనురాగం 
  కమ్మనీ  సమ భాగం 
  గొప్పలు తప్పులు చూడక 
  నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక 
  జన్మించినారా రాజులై 
  పేరొందినా నిరు పేదలై 
  నీవంటిపై సుతులు  చితులకాల్చుకున్నా  
  నీవంటి తల్లింక దేవుళ్ళకేలేదు
  నేలమ్మ నేలమ్మ నేలమ్మ 
  నీకు వేల వేల వందనాలమ్మా


  రచన - సుద్దాల అశోక్ తేజ   
  సంగీతం - కాదూరి ప్రహ్లాద్
  గానం -  S P బాల సుబ్రహ్మణ్యం 

 • You might also like