మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • చలో ధూం దాం  చలో ధూం దాం...

  చలో ధూం...దాం
  చలో ధూం దాం&చలో ధూం&దాం
  చలో ధూం దాం తెలంగాణ జాతరొచ్చెరా
  మత్తడి దుంకి అలుగు తన్నుకుని పారినట్లు
  మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు
  నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంకినట్లు
  ॥ చలో ధూం దాం ॥
  నాటి మున్నూట పానాల మునుమే ఇదిరా
  అది ఎగిలివారే పొద్దు ఎరుపే గదరా
  సుడిగాలై కరీంనగర్ సుట్టూకొస్తే
  రంగూ-రంగులా జెండలన్ని ఎలిసిపాయెరా
  ॥ చలో ధూం దాం ॥
  అభివద్ధి కొంగజపం భైరంగంరా
  జలవనరుల తెలంగాణ మనదే గదరా
  సవాలన్న రారాజుల గోసులూడగా
  మన రోషం జనహోరై జైకొట్టెరా
  ॥ చలో ధూం దాం ॥
  కూలిన మన సెరువులకు పానాలొచ్చురా
  ఎండిన మన వాగులకు పరుగులొచ్చురా
  తల జుట్టేసి మక్కల కంకులూరగా
  వలసెల్లిన పచ్చులు తమ గూడు జేరగా
  ॥ చలో ధూం దాం ॥
  మబ్బులు తొలగి సెంద్రుడు నేలను జూసే
  నీటి కలువలేమో రంగులతో సింగిడివేసే
  పల్లెసద్దుల నాడు సిబ్బిలో పువ్వులు పేర్వా
  దసర పండుగ జేసి పాలపిట్టను జూడా
  ॥ చలో ధూం దాం ॥
  భావాలకు జీవోలకు కాళ్లే రాంగా
  విశాలాంధ్ర వాదాలకు సావే రాంగా
  రెండో ఎస్సార్సీ సన్నాయి నొక్కులపైనా
  మన రాష్ట్రం మనదన్న హక్కులనే చాటగా
  ॥ చలో ధూం దాం ॥
  నీళ్లు దోసేటి నీచులతో పందెం గాద్దాం
  భూకబ్జాదారుల కెదురు లడాయి జేద్దాం
  కోతబెట్టి కరెంటు పంట లెండబెడ్తే
  ఇండ్లు గూల్చి పేదోళ్లను తరిమీ కొడితే
  ॥ చలో ధూం దాం ॥
  కాముడు సుట్టూ సేతిలో సెయ్యేసి దుంకుదాం
  జాజిరికోలలే జంట తాళాలై ఆడుదాం
  ఢిల్లీకి మన డోలు దెబ్బ ఉరుములుగ వినిపిద్దాం
  డప్పుగొట్టి తెలంగాణ సాటింపు జేద్దాం
  ॥ చలో ధూం దాం ॥
  ఉడుకు నెత్తుర్లతో ఈ నేల తడ్వొద్దురా
  దోపిడీకి, ద్రోహాలకు తావొద్దురా
  ఎములాడ రాజన్న పబ్బతి పడదామురా
  ఎగిరెగిరి తెలంగాణ ఉట్టే గొడ్తామురా
  ॥ చలో ధూం దాం ॥
  చలో ధూందాం తెలంగాణ దండుగట్టరా
  లేసి ఉరుకంగ ముసలోళ్లకు రోషమొచ్చెరా
  మన రాష్ట్రం అచ్చెదాక పన్నులు గట్టొద్దురా
  పల్లె పల్లె తెలంగాణ పాలన నడవాలిరా
  కలం: మిత్ర            గళం: విమలక్క
 • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి