మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • నిన్ను విడిచి ఉండలేనమ్మా... ఓ పాటమ్మా  నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా
  ఎన్నడు మరిచి పోనమ్మో నా పాటమ్మా   |2| 

  ప్రతి మదిలోన మెదులూతుంటవో పాటమ్మ నా యదలోన పదిలంగుంన్నవో  పాటమ్మ      
  | నిన్ను|

  ఉద్యమానికూపిరూదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవో
  ఊరెసేలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటవో 

  ఉద్యమానికూపిరూదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవో
  ఊరెసేలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటవో 
  ఊరు ఊరు దొరల కెదురు దిరగామన్నందుకే ఓ పాటమ్మా   జయరాజన్న వెంట జైలుకు వోయి జంగు 
  సైరనూదినావమ్మ  
      
  | నిన్ను|

  వంగపండు ప్రసాదు నోటివెంట ఒడి ఒడి గా దూకుతుంటవో
  గూడ అంజన్నకు తోడునీడగుంటు ఊరు వాడ మనదంటవో      

  వంగపండు ప్రసాదు నోటివెంట ఒడి ఒడి గా దూకుతుంటవో
  గూడ అంజన్నకు తోడునీడగుంటు ఊరు వాడ మనదంటవో
  అందె శ్రీ వంటి నిండా అలుముకొని ఓ పాటమ్మా
  వరంగల్లు సీనన్న నెంటవెట్టు కోని పల్లె చుట్టి వస్తవో

  | నిన్ను| 

  ప్రేమ ప్రేమకు మద్య పెద్దమనిషివయ్యి ఇద్దరినీ కలుపుతావమ్మ
  యుద్ధం లో ఒరిగిన వీరుల్ని ముద్దాడేదాక నిద్దుర పోవమ్మ 

  ప్రేమ ప్రేమకు మద్య పెద్దమనిషివయ్యి ఇద్దరినీ కలుపుతావమ్మ
  యుద్ధం లో ఒరిగిన వీరుల్ని ముద్దాడేదాక నిద్దుర పోవమ్మ
  అమర వీరుల అమ్మ నాన్నలకు నువ్వు ఓ పాటమ్మా కన్న బిడ్డల కండ్ల ముందు చూపిస్తావు ఎన్నేల్లైనా మళ్లీ బతికిస్తూఉంటావు

  | నిన్ను|

  పర దేశి వాళ్ల నోటిలోన నువ్వు పడరాని పాట్లు వడతావో
  స్వదేశి వాళ్ల స్వార్ధాన్ని అర్ధం జేసుకుని మెసులుతుంటవో

  పర దేశి వాళ్ల నోటిలోన నువ్వు పడరాని పాట్లు వడతావో
  స్వదేశి వాళ్ల స్వార్ధాన్ని అర్ధం జేసుకుని మెసులుతుంటవో
  ఒకడు రాసి ఇంకొకడు పేరుమోస్తె  ఓ పాటమ్మా .... కనులారా జూచి ఏమి జేయలేక కుమిలి కుమిలి పోతవోయమ్మ

  | నిన్ను|

  దండకారణ్యం లోన దండు నడిపేటోల్ల తోని అండగా ఉంటవో
  దళం లోకి కొత్త తమ్ముళ్లను చేరదీయడము లో ముందుంటవో

  దండకారణ్యం లోన దండు నడిపేటోల్ల తోని అండగా ఉంటవో
  దళం లోకి కొత్త తమ్ముళ్లను చేరదీయడము లో ముందుంటవో
  ఒరిగిన అమరవీరుల ఆశయాలను ఒక్కొక్కటి గుర్తు జెస్తవో
  దండిగా పోరు జేయమని గుండె దైర్యాన్ని నూరి పోస్తవో

  | నిన్ను|

  నీ తోడు ఉంటె ఏ బాధ ఉండదని తెలవనోల్లు కొందరు
  అసలు కళాకారులయ్యి పుట్టనందుకు కుమిలిపోయెవాల్లు ఎందరో

  నీ తోడు ఉంటె ఏ బాధ ఉండదని తెలవనోల్లు కొందరు
  అసలు కళాకారులయ్యి పుట్టనందుకు కుమిలిపోయెవాల్లు ఎందరో
  ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంట డోయమ్మ
  నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలివదోయమ్మ

  | నిన్ను|

  తొలకరొచ్చి రైతు అరక దున్నేకాడ సేదదీర చెలిమి జేస్తవో
  పంట రాసివోసి కుండ గొలిసే కాడ రైతు నోట రాగమైతవో

  తొలకరొచ్చి రైతు అరక దున్నేకాడ సేదదీర చెలిమి జేస్తవో
  పంట రాసివోసి కుండ గొలిసే కాడ రైతు నోట రాగమైతవో
  పంటనంత  బండి మీదికెత్తినంక ఎడ్ల మెడలో గంట వైతవో
  గిట్టువాటు ధర  కొరకు కొట్లాడ మని కోటి గొంతులల్ల ఒక్కటైతవో

  | నిన్ను|

  సచ్చంగల్ల మా సమ్మక  సారక్క తల్లులని అంటవో
  మహిమగల్ల మా దేవుడు ఎములాడ రాజన్నంటవో

  సచ్చంగల్ల మా సమ్మక  సారక్క తల్లులని అంటవో
  మహిమగల్ల మా దేవుడు ఎములాడ రాజన్నంటవో
  అల్లా ఏసు కొమిరెల్లి మల్లన్న కోటి దేవత లందరూ నీ కూత చెవిన వడక పోతే బయటకు రానని మొండికేస్తారో  

  | నిన్ను|

  దొంగ సర్కారుకు వొంగి బతకొద్దని సంఘాలెన్నొ పెట్టి వస్తవో 
  అన్యాయాన్ని ఎదిరించే అన్నలతోని అండదండగా ఉంటవో 

  దొంగ సర్కారుకు వొంగి బతకొద్దని సంఘాలెన్నొ పెట్టి వస్తవో 
  అన్యాయాన్ని ఎదిరించే అన్నలతోని అండదండగా ఉంటవో 
  పోరు జేయ్యకుంటే బతుకు మారదన్నందుకే ఓ పాటమ్మా కడుపులోన ఎన్ని తూటాలు వడ్డా కలత చెందని మనసు నీదమ్మా   

  | నిన్ను|

  అమ్మనాన్నల సంపాదనేమిలేదు తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు కడుపు మాడ్చుకోని కన్నవాల్లనిడిచి  ఎన్నో ఊర్లు తిరిగి గెలిచి వస్తమో 

  అమ్మనాన్నల సంపాదనేమిలేదు తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు కడుపు మాడ్చుకోని కన్నవాల్లనిడిచి  ఎన్నో ఊర్లు తిరిగి గెలిచి వస్తమో 
  నిన్ను నమ్ముకోనే బతుకుతున్నమో ఓ పాటమ్మా ఉన్న నాడు కలిసి తింటము లేకుంటే నిను తలసుకుంటమో 

  | నిన్ను|

  సుద్దాల హనుమంతును ముద్దాడి బుద్ది మాటలెన్నో చెప్పినవ్ సుబ్బారావు పాణిగ్రహి చేతిలోన  జమిడికె మోతై మోగినవ్ 

  సుద్దాల హనుమంతును ముద్దాడి బుద్ది మాటలెన్నో చెప్పినవ్ సుబ్బారావు పాణిగ్రహి చేతిలోన  జమిడికె మోతై మోగినవ్ 
  సిందు ఎల్లమ్మతో ముందు నడిచి మా పల్లెలన్ని కలియదిరిగినవ్ శంకరన్న సారంగపాణి లతో కడదాక కలిసి నడసినవ్ 

  | నిన్ను|

  వేల్లివాడల పురుడువోసుకొని పల్లె తల్లి కడుపు పంటవైతవో  తెలంగాణకు తోబుట్టువైతవొ అందరికీ  ఆడిబిడ్డవైతవొ 

  వేల్లివాడల పురుడువోసుకొని పల్లె తల్లి కడుపు పంటవైతవో  తెలంగాణకు తోబుట్టువైతవొ అందరికీ  ఆడిబిడ్డవైతవొ 
  ఏ తల్లి జన్మనిచ్చిందో గాని ఓ పాటమ్మా పదికాలాల పాటు సల్లంగుండాలే నాతల్లి నీకొంధనాలమ్మ 

  నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా
  ఎన్నడు మరిచి పోనమ్మో నా పాటమ్మా   

  ప్రతి మదిలోన మెదులూతుంటవో పాటమ్మ నా యదలోన పదిలంగుంన్నవో  పాటమ్మ 

  నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా
  ఎన్నడు మరిచి పోనమ్మో నా పాటమ్మా   

  ఎన్నడు మరిచి పోనమ్మో నా పాటమ్మా   

  ఎన్నడు మరిచి పోనమ్మో నా పాటమ్మా   

 • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి