మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • ఓ చెట్టు ఆత్మఘోష by తిరుపతి మాట్ల


  పర్యవరణ౦ను పాతరేస్తు..మానవుడు సాగిస్తున్న మనుగడపై..ఓ చెట్టు ఘోషిస్తు పాడిన పాట. తన ఆత్మఘోష.  పైన వీడియో రాకపోతే గీడ ఒత్తుర్రి

  నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటె 
  నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటె 

  మనిసినా వంటిని తాకెటోడా? ఆ ఆ 

  మనిసినా వంటిని తాకెటోడా?
  వాని మనుగడను సాగించువాడా ?

  వృక్షాన్ని రా...  నేను  వృక్షాన్ని రా...  
  మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా... 

  వృక్షాన్ని రా... నేను  వృక్షాన్ని రా... 
  మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా... 

  మట్టి తల్లి యదలు చీల్చుకుని మొలకనయ్యి పురుడు వోసుకొని 
  మట్టి తల్లి యదలు చీల్చుకుని మొలకనయ్యి పురుడు వోసుకొని 

  మానవ జాతికి సేవజేసి 
  మహా వృక్షానిగ పేరుమోసి 

  పుట్టెడు కష్టాలకోర్సుకున్నా 
  సుట్టమోలె మిమ్ము సూసుకున్న 

  కక్షగట్టి నా ప్రాణాలు బలిగొంటే ఏ ఏ 
  కట్టె నయ్యి కాలిపోత ఉన్న 

  వృక్షాన్ని రా... నేను  వృక్షాన్ని రా... 
  మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా... 

  బతుకంత మీతొటే పయనమైతి 
  చితిలోనైనా మీతో కలిసి ఉంటి 

  బతుకంత మీతొటే పయనమైతి 
  చితిలోనైనా మీతో కలిసి ఉంటి 

  దేవుడు గలిపిన బంధానిగా 
  జన్మన్త మీ తోడు నేనుంటిగా 

  దేవుడు గలిపిన బంధానిగా 
  జన్మన్త మీ తోడు నేనుంటిగా

  తాతల తండ్రుల నాటినుంచి కంటికి రేప్పోలె జూసుకుంటి 

  అవసరానికి నన్ను వాడుకుంటే ఏ ఏ 
  అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటి 

  వృక్షాన్ని రా... నేను  వృక్షాన్ని రా... 
  మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా...

  నా వేరులో ఔషదాన్ని దాచినా నా కొమ్మని ఆయుదంగందించిన 
  వేరులో ఔషదాన్ని దాచినా నా కొమ్మని ఆయుదంగందించిన 

  పాడు గాలిని  కడుపు నింపుకున్న 
  ప్రాణవాయువు మీకు పంపుతున్న 

  పాడు గాలిని  కడుపు నింపుకున్న 
  ప్రాణవాయువు మీకు పంపుతున్న 

  సేద దీరెన్దుకు మంచమైన సేత గాని నాడు చేతి కర్రనైన 

  ఇన్ని జేసిన నన్ను మరువకురా ఆ ఆ 

  ఊరికే ఊపిరి దియ్యకురా 

  వృక్షాన్ని రా... నేను  వృక్షాన్ని రా... 
  మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా...

  చంపద్దురా నన్ను చంపద్దుర 
  మీ బతుకుల్ల సీకట్లు నింపద్దురా
  Save Trees Save Future
  మీ తిరుపతి మాట్ల 
 • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి