Full width home advertisement

Post Page Advertisement [Top]
గావు పిల్లలు ఘటం కుండలు
యాటా పోతులు యాపారిల్లలు 
గుగ్గిలం మైసాచి తోటి 
ఉసగొలిపే  ఊదు పొగలు 
గణ గణ గంటల మోతలు 
ధన ధన  డప్పుల దరువులు 
గడ గడ గడ ఘాతలు  పెట్టే 
బైంల్లోన్ల  పెడబొబ్బలు బొబ్బలు 
బొబ్బలు  బొబ్బలు  బొబ్బలు 

దండి బోనం  తీద్దుమే 
దేవతుల పోషవ్వకు  
నిండొక్కాపొద్దులు బడుదుమే
గోల్కోండ ఎల్లవ్వకు

కొడిపుంజు లెదురిద్దుమే
ఎములాడ బద్ది పోసుకు 
కోటొక్క పూజలు జేద్దుమే
జూబ్లీహిల్సు పెద్దమ్మకు మాతల్లి గంగమ్మకు 

తెల్ల చీరలే నీకు తెల్ల రైకలే తెల్లా వన్నె గొర్రెపోతు నీకు తెద్దుమే 
డోలు దెబ్బలే సన్నాయి మోతలే 
శిగాలూగే శివసత్తులు నీకు ఇష్టమే 

కనుములు కట్నాలు పెట్టి
పసుపూ కుంకుమలు బెట్టి 
కల్లు కుండలు తీసుకొచ్చి
తల్లీ ముందు శాకబెట్టి 
కరుణించే దొరసానికి
పొర్లు దండాలు బెట్టి 
కడుపులోని కష్టాలు
ముడుపుగట్టి ముంగటబెట్టి       || ఓ || 

మరువకుండ దెచ్చినామమ్మా నీకు
బోనాలే మైసిగండి మైసమ్మ 
కోరితెచ్చినాము సారెలు నీకు
ఊరును గాసేటి తల్లీ పోలేరమ్మ 
సక్కని తల్లి నీకు తొట్టెలంటనే
సల్లని తల్లీ మీకు మొక్కులంటనే 

ఏ పేరున పిలిసినా ఆ తీరున పలికేటి అమ్మలగన్నమ్మలకు కోటిదందాలే

దండీ  బోనం  తీద్దుమే
బల్కంపేట ఎల్లమ్మకు 
గండదీపం ఎలిగిద్దుమే
మాయమ్మా ముత్యాలమ్మకు 
మత్తా గొలుపు జేద్దుమే
మాతల్లి మారెమ్మకు 
పచ్చికుండ బోనమెత్తుదుమే
పగడాల దుర్గమ్మకు 

గావు పిల్లలు ఘటము  కుండలు
యాటా పోతులు యాపారిల్లలు 
గుగ్గిలం మైసాచి తోటి 
ఉసగొలిపే  ఊదు పొగలు 

జో జో మేకమ్మ జోమేకమ్మా  జోమేకమ్మా 
గావు పిల్లలు నీకు ఘటము కుండాలే ఘటము కుండాలే 

జో జో మేకమ్మ జోమేకమ్మా  జోమేకమ్మా 
గావు పిల్లలు నీకు ఘటము కుండాలే ఘటము కుండాలే 

జో జో మేకమ్మ జోమేకమ్మా   
జో జో మేకమ్మ జోమేకమ్మా   

జో జో మేకమ్మ జోమేకమ్మా  జోమేకమ్మా

గావు పిల్లలు నీకు ఘటము కుండాలే ఘటము కుండాలే 

ఒక్కేసి డప్పులట   ఒక్కా శివసత్తులట 
ఒక్కేసి డప్పులట   ఒక్కా శివసత్తులట

కాలు కదిలీయమ్మో మావురాలెల్లమ్మ గజ్జె కదిలీయమ్మో మావురాలెల్లమ్మ

గావు పిల్లలు ఘటం కుండలు
యాటా పోతులు యాపారిల్లలు 
గుగ్గిలం మైసాచి తోటి 
ఉసగొలిపే  ఊదు పొగలు 
గణ గణ గంటల మోతలు 
ధన ధన  డప్పుల దరువులు 
గడ గడ గడ ఘాతలు  పెట్టే 
బైంల్లోన్ల  పెడబొబ్బలు బొబ్బలు 
బొబ్బలు  బొబ్బలు  బొబ్బలు 

అవనీ ఏలు తల్లి ఆది శక్తీవమ్మ 
దివినుంచి దిగిచ్చినా దివ్యజ్యోతివమ్మ 
లష్కర్ బోనాలు ఏటేట పూజలు 
కోటొక్క భక్తులతో నీ పాదసేవలు

జగమేలే తల్లి మాంకాలమ్మా అమ్మా సుగుణాల తల్లి మముగన్నమ్మా 
జగమేలే తల్లి మాంకాలమ్మా అమ్మా సుగుణాల తల్లి మముగన్నమ్మా 

లోకాలనుగాసే లోకమాతలమ్మ మీరు 
జగాలు పాలించే ఆది దేవతలు మీరు 

దందాలే గోలుకొండ ఎల్లమ్మ 
దందాలే మైసిగండి మైసమ్మ 
దందాలే చార్మినారు భాగ్యలక్ష్మమ్మ 
దందాలే ఉజ్జయిని మాంకాలమ్మా  
ఈ పాట మనుసులు :
పాట రాశినాయన  -  తిరుపతి మాట్ల
పాట కట్టినాయన -  సురెష్ బొబ్బిలి
డప్పు సప్పుల్లు  - మిట్టు 
బొమ్మలు దీశినాయన - తిరుపతి, మధు కొత్వాల్
గమ్మతి జేసినయన - రాహుల్ ఆరెట్టి 
కత్తిరిచ్చినాయన  - ఊదయ్ కుంబం
నడిపిచ్చినాయన - సతిష్ మంజీర 
దొర - దాము కొసనం
పటేలు - అప్పి రెడ్డి
Big Bow to MIC TV ..  You are Rocking

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]