తెలంగాణా పదకోశం
ఈడ మన పదాలు, వాటి వాడుక అర్దాలు ఉన్నయ్, ఇడ లేని, మీకు తెలిసిన తెలంగాణ మాటలు కూడా చెప్పాలనుకుంటుర్రా ఐతే గీ లింక్ వొత్తుర్రి. ఏం భయం అక్కర లే, ఇది మంచోల్ల చేతుల్లనే ఉన్నది.
1 | తూటు | రంధ్రం |
2 | ఏతులు | గొప్పలు |
3 | మలుపు | మూల |
4 | తాపతాపకు | మాటిమాటికి |
5 | జల్ది | త్వరగా |
6 | కొత్తలు | డబ్బులు |
7 | ఏంచు | లెక్కించు |
8 | నాదాన | బలహీనం |
9 | నప్పతట్లోడు | పనికి మాలినవాడు |
10 | ల్యాగ | ఆవు దూడ |
11 | గుపాయించు | జొరబడు |
12 | కూకొ | కూర్చో |
13 | కూనం | గుర్తు |
14 | మడిగ | దుకాణం |
15 | పొట్లం | ప్యాకింగ్ |
16 | బత్తీసలు | అప్పడాలు |
17 | పతంగి | గాలిపటం |
18 | సోంచాయించు | ఆలోచించు |
19 | పయఖాన | టాయిలెట్ |
20 | మోసంబి | బత్తాయి |
21 | అంగూర్ | ద్రాక్ష |
22 | కష్‌కష్ | గసాలు |
23 | కైంచిపలంగ్ | మడత మంచం |
24 | చెత్రి | గొడుగు |
25 | కల్యామాకు | కరివేపాకు |
26 | మచ్చర్‌దాన్ | దోమతెర |
27 | మడుగుబూలు | మురుకులు |
28 | జమీర్‌ఖాన్ | భూస్వామి |
29 | జాగా | స్థలం |
30 | తండా | చల్లని |
31 | గర్మి | వేడి |
32 | వూకె | ఉట్టిగా |
33 | సిలుం | తుప్పు |
34 | నియ్యత్ | నిజాయితీ |
35 | తపాలు | గిన్నె |
36 | తైదలు | రాగులు |
37 | పలంగి | మంచము |
38 | బలంగ్రి | డ్రాయింగ్ రూం |
39 | సల్ప | నున్నని రాయి |
40 | దప్పడం | చారు |
41 | గెదుముట | పరిగెత్తించుట |
42 | తొక్కు | పచ్చడి |
43 | కిసా | జేబు |
44 | సల్ల | మజ్జిగ |
45 | అర్ర | గది |
46 | బుడ్డలు | పల్లీలు |
47 | గడెం | నాగలి |
48 | గాండ్లు | బండి చక్రాలు |
49 | కందెన | ఇంధనం |
50 | ఉప్పిండి | ఉప్మా |
51 | చిమ్ని | బుగ్గదీపం |
52 | తపుకు | ప్లేటు |
53 | ముగ్గ | చాలా |
54 | కందీలు | లాంతరు |
55 | బటువు | ఉంగరం |
56 | బాండ్లి | మూకుడు |
57 | సలాకి | అట్లకాడ |
58 | ఈలపీట | కత్తిపీట |
59 | గనుపట్ల | గడప దగ్గర |
60 | గుండ్లు | రాళ్ళు |
61 | సల్వ | చల్లదనం |
62 | ఏట కూర | మేక మాంసం |
63 | గాలిపంక | ఫ్యాను |
64 | షాపలు | చేపలు |
65 | సౌంర్త పండుగ | పుష్పాలంకరణ |
66 | కుమ్మరావి | కుండలబట్టి |
67 | లోట | డబ్బ |
68 | ఇడుపు | గోడంచు |
69 | సౌరం | క్షవరం |
70 | శిబ్బి | తీగల జల్లెడ |
71 | శిరాపురి | పరమాన్నం |
72 | తీట | కోపం |
73 | పటువ | కుండ |
74 | తలె | పల్లెం |
75 | పొర్క | చీపురు |
76 | సపారం | పందిరి |
77 | సర్కార్ ముల్లు | కంపముల్లు |
78 | దేవులాడు | వెతుకు |
79 | వాగు | నది |
80 | సడాకు | రోడ్డు |
81 | చిత్పలకాయ | సీతాఫలం |
82 | ఏమది | ఏమిటి |
83 | లచ్చమ్మ | లక్ష్మమ్మ |
84 | రామండెం | రామాయణం |
85 | తక్కడి | త్రాసు |
86 | గంటె | చెంచా |
87 | కాందాని | పరువు |
88 | బూగ | తూనీగ |
89 | సందుగు | పెట్టె |
90 | బిటాయించు | కూర్చోమను |
91 | జొన్న గటుక | జొన్న గింజల అన్నం |
92 | కంచె | సరిహద్దు |
93 | లైయ్ | అతికించే పదార్థం |
94 | బాపు | నాన్న |
95 | ఆనతి | అభయం |
96 | సోలుపు | వరుస |
97 | పీనోడు | పెండ్లి కొడుకు |
98 | దురస్తు | బాగుచేయు |
99 | శిరాలు | మెడ |
100 | ఆర్సీలు | కళ్ళజోడు |
101 | మక్కెండ్లు | మొక్కజొన్న |
102 | సుట్టాలు | బంధువులు |
103 | మాలస | ఎక్కువ |
104 | కైకిలి | కూలి |
105 | కొయ్‌గూర | గొంగూర |
106 | కూడు | అన్నం |
107 | అసంత | దూరంగ |
108 | సిబ్బి | గుల్ల |
109 | పావుడ | పార |
110 | సలమల | వేడిలో మరగడం |
111 | ఊకో | కాముగా ఉండు |
112 | జల్దిరా | తొందరగా రా |
113 | తపుకు | మూత |
114 | తువ్వాల | చేతి రుమాలు |
115 | లాగు | నెక్కరు |
116 | కాయిసు | ఇష్టం |
117 | బుగులు | భయం |
118 | ఉర్కుడు | పరుగెత్తుడు |
119 | శానా | చాల |
120 | గట్లనే | అలాగే |
121 | గిట్లాంటి | ఇలాంటి |
122 | బర్కత్ | లాభం |
123 | కుసో | కూర్చొండి |
124 | తర్జుమా | అనువాదం |
125 | నెరసు | చాలా చిన్నదైన |
126 | బకాయి | చెల్లించవలసిన మొత్తం |
127 | తోఫా | కానుక |
128 | ఇలాక | ప్రాంతం |
129 | బరాబరి | సరి సమానం |
130 | ఉసికే | ఇసుక |
131 | తోముట | రుద్దుట |
132 | గీరె | గిరక |
133 | బొంది | శరీరం |
134 | ఉలికిపడుట | అదిరిపడుట |
135 | ఈడు | వయసు |
136 | జోడు | జంట |
137 | గోడు | లొల్లి |
138 | అల్లుట | పురి వేయుట |
139 | నుల్క | మంచానికి అల్లే తాడు |
140 | శెల్క | తెల్లభూమి |
141 | మొల్క | పుట్టిన మొక్క |
142 | శిల్క | చిలుక |
143 | పల్కు | మాట్లాడు |
144 | ఈతల | ఈవల |
145 | ఆతల | ఆవల |
146 | తను | అతడు |
147 | దిడ్డి ధర్వాజ | మరో ద్వారం |
148 | కొట్టం | పశువుల పాక |
149 | గూటం | పశువుల కట్టేసే గుంజ |
150 | పగ్గం | తాడు |
151 | శాయిపత్తి | తేయాకు |
152 | పెంక | పెనం |
153 | సుంకం | పన్ను |
154 | లెంకు | వెతుకు |
155 | తొంట చెయ్యి | ఎడమ చెయ్యి |
156 | తక్కెడు | ముప్పావు కిలో |
157 | నడిమీలకు | మధ్యలకు |
158 | పుండు కోరుడు | వివాదాస్పదుడు |
159 | పత్యం | నియమాహారం |
160 | పాకులాడు | ప్రయత్నించు |
161 | పగిటీలి | పగటి పూట |
162 | పొడవూత | పొడవునా |
163 | పొద్దుగాల | ఉదయం |
164 | బరిగె | బెత్తం |
165 | బంజరు | ప్రభుత్వ భూమి |
166 | దెంకపోవుట | పారిపోవుట |
167 | నజీబ్ | అదృష్టం |
168 | మాలేస్క | ఎక్కువ |
169 | మతులాబ్ | విషయం |
170 | మనుండంగ | ప్రాణంతో ఉండగ |
171 | సటుక్కున | తొందరగా |
172 | సముదాయించుట | నచ్చ జెప్పుట |
173 | సైలేని | చక్కగా లేని |
174 | ఇకమతు | ఉపాయం |
175 | ఎక్క | దీపం |
176 | ఆలి | పెండ్లం |
177 | దుత్త | చిన్న మట్టి కుండ |
178 | ఎళ్ళింది | పోయింది |
179 | గైండ్ల | వాకిట్ల |
180 | తలగాయిండ్ల | వాకిలి ముందు |
181 | అంబలి | జావ |
182 | దప్పడం | సాంబారు, పప్పుల పులుసు |
183 | కుడుము | ఇడ్లీ |
184 | ఎసల | వండులకు ఉపయోగించే కుండ |
185 | నాలె | నేల |
186 | ఓరకు | పక్కకు |
187 | ఒల్లె | చీర |
188 | తాతిపారం | మెల్లగ |
189 | ఎరుక | తెలుసు |
190 | మొరగు | అరచు |
191 | అంబాడు | చిన్నపిల్లల పాకుడు |
192 | అర్సుకొనుట | పరామర్శించుట |
193 | ఊసు | కండ్ల నుండి వచ్చే మలినం |
194 | ఎటమటం | అస్తవ్యస్తం |
195 | ఎఱ్ఱ | వానపాము |
196 | చిలుక్కొయ్య | కొక్కెము |
197 | గులుగుట | లోలోపల మాట్లాడుట |
198 | గువ్వము | గుజ్జు |
199 | జీవిలి | చెవిలోని మలినం |
200 | జోకు | తూకం |
201 | తాంబాళం | పెద్ద పళ్ళెం |
202 | నసుకు | చెప్పుటకై వెనకాముందాడుట |
203 | నెరి | పూర్తిగా |
204 | బీరిపోవు | ఆశ్చర్యపడు |
205 | మాగికాలం | పగలు తక్కువగా ఉండే కాలం |
206 | వొయ్య | పుస్తకం |
207 | సోయి | స్పృహ |
208 | బిశాది | విలువ |
209 | పతార | పలుకుబడి |
210 | పజీత | పరువు |
211 | సాపిచ్చుట | తిట్టుట |
212 | పస్కలు | కామెర్లు |
213 | గౌర | గరాటు |
214 | గాసం | దాన |
215 | బల్గం | బంధుజనం |
216 | సొరికి | సొరంగం |
217 | సౌలతు | వసతి |
218 | బోలెడు | చాల |
219 | ఓపాలి | ఓసారి |
220 | యాల్ల | సమయం |
221 | కారటు | ఉత్తరం |
222 | డోకు | వాంతి |
223 | టప్పా | పోస్టు |
224 | సూటి | గురి |
225 | సోల్తి | జాడ |
226 | సోపతి | స్నేహం |
227 | ఎర్కలే | జ్ఞాపకం లేదు |
228 | ఉత్తగ | ఊరికే |
229 | నువద్ది | నిజంగా |
230 | పైలం | జాగ్రత్త |
231 | శరం | సిగ్గు |
232 | ఛిద్రం | రంధ్రం |
233 | మతలబు | విషయం |
234 | ఎండ్రికాయ | పీత |
235 | జబర్‌దస్తీ | బలవంతం |
236 | కనరు | వెగటు |
237 | ఇడిసిపెట్టు | వదిలిపెట్టు |
238 | గత్తర | కలరా |
239 | ఇగురం | వివరం |
240 | పరదా | తెర |
241 | గుర్రు పెట్టుట | గురక పెట్టుట |
242 | గులగుల | దురద |
243 | గులాం | బానిస |
244 | గిచ్చుట | గిల్లుట |
245 | పిసరంత | కొద్దిగా |
246 | గుత్త | మొత్తం ఒకేసారి |
247 | గుండిగ | వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర |
248 | శిట్టశిట్ట | తొందరగా |
249 | బర్ఖతక్కువ | వృద్దిలేని |
250 | వుర్కు | పరుగెత్తు |
251 | సర్రున | వెంటనే |
252 | మొస | శ్వాస |
253 | బుదగరింపు | ఓదార్పు |
254 | ఓమానంగా | అతి కష్టంగా |
255 | గల్మ | ద్వారం |
256 | పొల్ల | అమ్మాయి |
257 | ఆయమన్న | ఉన్నదాంట్లో మంచిది |
258 | లొల్లి చప్పుడు | |
259 | ఇషారా | వివరాలు |
260 | కారెడ్డెం | మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం |
261 | దూప | దాహం |
262 | తొవ్వ | దారి |
263 | లగ్గం | పెళ్ళి |
264 | ఏసిడి | చెడుకాలం |
265 | జరంత | కొద్దిగా |
266 | పైలం | పదిలం |
267 | యాదుందా | జ్ఞాపకం ఉందా |
268 | ఎక్కిరింత | వెక్కిరించుట |
269 | సవుసు | ఆగు |
270 | చితల్‌పండు | సీతాఫలం |
271 | కాలం చేసుడు | మరణించుట |
272 | మస్తుగ | మంచిగ |
273 | నిరుడు | గత సంవత్సరం |
274 | పోవట్టిన | వెళ్తున్న |
275 | పొద్మికి | సాయంత్రం |
276 | ఉత్తగ | ఊరకే |
277 | బుదగరిచ్చి | బతిలాడి |
278 | యాష్ట | విసుగు |
279 | తెగదెంపులు | విడాకులు |
280 | సాయిత | దంట |
281 | లొల్లి | గోల |
282 | పాయిద | లాభం |
283 | తోడెం | కొంచెం |
284 | భేట్ | కలయిక |
285 | కీలు | తాళం |
286 | ఫకత్ | ఎల్లప్పుడు |
287 | పంఖా | విసనకర్ర |
288 | గూసలాట | పొట్లాటా |
289 | ఝగడ్ | జగడం |
290 | నిత్తె | ప్రతి దినం |
291 | గాయి | అల్లరి |
292 | సెక | మంట |
293 | మస్కున | మసక చీకటిలో |
294 | తోగరుపప్పు | కందిపప్పు |
295 | అయి | అమ్మ |
296 | గాడికా | అక్కడికా |
297 | లెంకుట | వెదుకుట |
298 | పక్కా | నిశ్చయము |
299 | ఉండి | వరకట్నం |
300 | బుడ్డోడు | చిన్నవాడు |
301 | మెత్త | దిండు |
302 | అడ్డెనిగా | భోజన స్లాండు |
303 | పదిలెము | క్షేమం |
304 | సర్వపిండి | కారం రొట్టె |
305 | బొక్కెన | నీరుతోడే బక్కెట్ |
306 | వొర్రకు | అరువకు |
307 | గౌసెను | దిండు కవరు |
308 | కైకిలి | కూలీ |
309 | చెల్క | వర్షధార పొలం |
310 | గౌడి | కోట |
311 | ముల్లె | మూట |
312 | దర్వాజ | తలుపు |
313 | కొట్టము | గోశాల |
314 | తనాబ్బి | షెల్పు |
315 | ముంత | చెంబు |
316 | ఉరుకు | పరుగెత్తు |
317 | ఆత్రము | తొందర |
318 | సౌసు | ఆగు |
319 | శిబ్బి | అన్నం వంపే మూత |
320 | తల్లి గుంజ | పెళ్ళి పందిరికి తల్లి వంటిది |
321 | లగ్గం | పెండ్లి |
322 | నాగెల్లి | నాగవెల్లి |
323 | పైలము | జాగ్రత్త |
324 | దౌతి | సిరాబుడ్డి |
325 | ఎగిర్త | తొందర |
326 | అడ్లు | వరిధాన్యం |
327 | పుస్తె | తాళి |
328 | నొసలు | లలాటము |
329 | తోల్త | పంపిస్త |
330 | బాట | దారి |
331 | మంకు | బుద్ధిమాంద్యం |
332 | పత్త | చిరునామా |
333 | ఇకమత్ | తెల్వి |
334 | తకరారు | సతాయించుడు |
335 | తోడం | కొంచెం |
336 | పడిశం | సర్ధి |
337 | బలుపు | మదము |
338 | కండువ | టవల్ |
339 | అంగి | చొక్కా |
340 | బౌగొనె | గిన్నె |
341 | బువ్వ | అన్నం |
342 | ఎయ్యి | పెట్టు |
343 | గూడు | సెల్ఫ్ |
344 | నెత్తి | తల |
345 | వర్రుడు | బాగా మాట్లాడు |
346 | ఉరికిరా | పరిగెత్తుకుని రా |
347 | మాలెసా | బాగా |
348 | మడిగెలు | షెట్టర్లు |
349 | నూకు | వుడ్చుడు |
350 | ఉబ్బర | ఉక్కపోత |
351 | యాడికి | ఎక్కడికి |
352 | కుకొ | కూర్చుండు |
353 | జర ఆగు | కొద్దిగుండు |
354 | కంకలు | ఎడ్లు |
355 | మొగులు | ఆకాశం |
356 | మలగడం | తిరగడం |
357 | దబ్బన | తొందర |
358 | మారాజ్ | పూజారి |
359 | లడిక | గరాటు |
360 | శారాన | పావుల |
361 | బారాన | మూడు పావులాలు |
362 | కుర్స | పొట్టి |
363 | మోటు | గడుసు |
364 | గోసి | పంచ |
365 | బాపు | తండ్రి |
366 | కాక | బాబాయి |
367 | పెదబాపు | పెద్ద నాన్న |
368 | పెద్దాయి | పెద్దమ్మ |
369 | యారాలు | తోటి కోడలు |
370 | సడ్డకుడు | తోడల్లుడు |
371 | సాలెగాడు | బావమర్ది |
372 | తమ్మి | తమ్ముడు |
373 | దన్ననరా | త్వరగా రా |
374 | జల్దిరా | జెప్పున రా |
375 | ఊకో | ఆగు |
376 | సోపాల | ఒడి |
377 | ఓమాడి | పొదుపు |
378 | పురాత | పూర్తిగా |
379 | పైలంగరా | మెల్లగ రా |
380 | ఆడికేంచి | అక్కడి నుండి |
381 | లగు | బలుపు |
382 | పరేషాన్ | అలసట |
383 | ఇమ్మతి | సాయం |
384 | ఇమాకత్ | గర్వం |
385 | జాతర | తీర్ధం |
386 | పనుగడి | కొష్టం దరువాజ |
387 | సిడీలు | మెట్లు |
388 | తట్టి | పళ్ళెం |
389 | ఊరబిస్క | ఊరపిచ్చుక |
390 | ఆవలికి | బయటకు |
391 | పాయిరం | పావురం |
392 | ఆయేటిబూనంగ | తొలకరి |
393 | సడుగు | రోడ్డు |
394 | దొరింపు | మార్గం |
395 | కుందాపన | దిగులు |
396 | పిడుస | ముద్ద |
397 | దుబ్బ | మట్టి |
398 | చెండు | బంతి |
399 | బగ్గ | బాగా |
400 | బొచ్చెడు | చాలా |
401 | యాపాకులు | వేపాకులు |
402 | గాయిదోడు | ఆవారా |
403 | నడిమిట్ల | మధ్యన |
404 | సూరు | చూరు |
405 | పయ్య | చక్రం |
406 | ఒంటేలు | మూత్రం |
407 | రాతెండి | అల్యూమినియం |
408 | బర్మా | రంధ్రాలు చేసే సాధనం |
409 | ఇగురం | ఉపాయం |
410 | దిడ్డి | కిటికీ |
411 | ఇల వరుస | పద్ధతి |
412 | బుట్టాలు | లోలాకులు |
413 | గరిమి | వేడి |
414 | కచ్చురం | ఎడ్ల బండి |
415 | పెనిమిటి | భర్త |
416 | గలుమ | తలుపు |
417 | తల్వాలు | తలంబ్రాలు |
418 | పరాశికం | నవ్వులాట |
419 | మబ్బుల | వేకువ జామున |
420 | చిడిమెల | తొందరగా |
421 | కాపాయం | పొదుపు |
422 | యవ్వారం | వ్యవహారం |
423 | అలిమిబలిమి | ఇష్టాయిష్టాలు |
424 | మనాది | బెంగ |
425 | ఎటమటం | బెడిసికొట్టు |
426 | రంది | దిగులు |
427 | సడుగు | తొవ్వ |
428 | బాలకాలి | పిల్ల చేష్టలు |
429 | అగ్వ | చౌక |
430 | గాడ్పు | గాలి |
431 | ఇంగలం | నిప్పు |
432 | మాల్‌గాడి | గూడ్సు బండి |
433 | ఎక్వ తక్వ | హెచ్చుతగ్గులు |
434 | గిర్వి | తాకట్టు |
435 | కొలువు | నౌకరు |
436 | పాలోళ్ళు | దాయాదులు |
437 | పొద్దుగూకి | సాయంత్రం |
438 | జంగుబట్టింది | తుప్పుబట్టింది |
439 | మొగురం | కట్టెస్తంభం |
440 | గావురం | ప్రేమ |
441 | ఒద్దులు | దినములు |
442 | గలుమ | ద్వారము |
443 | లగాంచి | జోరుగా |
444 | రికాం | తీరిక |
445 | సుంసాం | నిశ్శబ్దం |
446 | తట్టు | గోనె సంచి |
447 | తొట్టె | ఊయల |
448 | ఇగం | అతి చల్లని |
449 | గవాబు | సాక్ష్యం |
450 | పైకం | డబ్బులు |
451 | తపుకు | మూత గిన్నె |
452 | సుతారం | సున్నితం |
453 | తోలుట | నడుపుట |
454 | కోల్యాగ | ఆవుదూడ |
455 | సొక్కంపూస | నీతిమంతుడు |
456 | బుదగరించుట | బుజ్జగించుట |
457 | బరివాత | నగ్నంగ |
458 | కోసులు | మైళ్ళు |
459 | తనాబ్బి | కప్ బోర్డు |
460 | వరపూజ | నిశ్చితార్థం |
461 | రయికె | జాకెట్టు |
462 | తనాబి | షెల్ఫ్ |
463 | తంతెలు | మెట్లు |
464 | ఆనక్కాయ | సొరకాయ |
465 | కలెగూర | తోటకూర |
466 | తొక్కు | ఊరగాయ |
467 | బుక్కెడు | ఒక ముద్ద |
468 | గంటే | గరిటే |
469 | గరిమికోటు | రెయిన్ కోటు |
470 | గంజు | వంట పాత్ర |
471 | రంజన్ | కూజ |
472 | నూతి | బావి |
473 | గడెంచే | నులకమంచం |
474 | అవతల | ఆరు బయట |
475 | గొడిసేపు | కాసేపు |
476 | నిరుడు యేడు | గత సంవత్సరం |
477 | కల్ప | మంగలి పెట్టే |
478 | టొక్క | పారిపోవడం |
479 | పత్తి | పాళీ |
480 | కందిలి | చిన్న దీపం |
481 | పొంతన | పోలిక |
482 | మోపున | జాగ్రత్తగ |
483 | పోగులు | కుప్పలు |
484 | ఎటమటం | పొరపాటు |
485 | సర్సుట | కొట్టుట |
486 | కాన్గి బడి | ప్రైవేటు బడి |
487 | మర్లబడుట | తిరగబడుట |
488 | తాషిలి | కీడు |
489 | కాంచి | సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట |
490 | దడ్లబురి | మగ కోతి |
491 | మొస | అధిక శ్వాస |
492 | డొక్క | కడుపు |
493 | అముడాల | కవల |
494 | ఆపతి పడుట | ప్రసవ వేదన |
495 | ఇగం | చల్లగ, హిమం |
496 | ఇడుపులు | ప్రవేశ ద్వార ప్రాంతం |
497 | ఇమానం | ప్రమాణం |
498 | ఎనుగు | ముండ్ల కంచె |
499 | ఏతులు | హెచ్చులు, గొప్పలు |
500 | బగరుకొట్టుట | వేగంగా శ్వాసించుట |
501 | కంచె | గడ్డి బీడు |
502 | కైలాట్కం | కలహం, కొట్లాట |
503 | జిట్టి | దృష్టి |
504 | జిమ్మ | జిహ్వ |
505 | తుత్తుర్లు | వెంట్రుకలు |
506 | దంచుట | దండించుట, కొట్టుట |
507 | దంగుట | తఱుగుట |
508 | నీయత్ | నిజాయితీ |
509 | పాసంగం | మొగ్గు |
510 | పురుసత్ | విశ్రాంతి |
511 | మిత్తి | వడ్డి |
512 | ఆయిటి | తొలకరి |
513 | ఇగురు | చిగురు |
514 | ఇగురం | వ్యూహం |
515 | ఇగ్గుట | సంకోచించుట |
516 | ఇచ్చంత్రం | విచిత్రం |
517 | ఒళ్ళక్కం | అబద్దం |
518 | కువారం | చెడ్డబుద్ధి |
519 | కైగట్టుట | కవిత్వం రాయుట |
520 | దసుకుట | కుంగుట |
521 | నక్కు | అతుకు |
522 | నాదాను | బలహీనం |
523 | నేఱివడుట | అలసిపోవుట |
524 | పతార | పరపతి |
525 | పుల్లసీలుట | అలసిపోవుట |
526 | బొండిగ | గొంతు |
527 | మాల్యం | దయ గలుగుట |
528 | మాయిల్యమే | వెంటనే, తొందరగ |
529 | మోర్‌దోపు | ప్రమాదకరమైన |
530 | తొవ్వ | బాట |
531 | మంకు | మొండితనం |
532 | నొసలు | నుదురు |
533 | దొబ్బు | నెట్టు |
534 | దీపంత | ప్రమిద |
535 | రౌతు | రాయి |
536 | పసిరికెలు | కామెర్లు |
537 | ఉబ్బు | ఉత్సాహం |
538 | పెయ్యి | వొళ్ళు |
539 | అంబటియాల | అంటి తాగే సమయం |
540 | ఆనగపు కాయ | సోరకాయ |
541 | ఇసుర్రాయి | విసురు రాయి |
542 | ఉలువచారు | ఉలువ కట్టు |
543 | ఎచ్చాలు | గరం మసాలా వస్తువులు |
544 | ఎసరు | అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు |
545 | ఒత్తి పొయ్యి | పొంత పొయ్యి |
546 | కడువ | నీరు తెచ్చుకునే మట్టి కుండ |
547 | గాబు | ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది |
548 | గుమ్మి | నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది |
549 | వత్తు | కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు) |
550 | కురాడు | బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ |
551 | సాయబాన్ | దంపతుల పడకగది |
552 | సానుపు | పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు |
553 | గిరుక | బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది |
554 | కంచుడు | పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ |
555 | గోరు కొయ్యలు | రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు |
556 | ఇకమత్ | ఉపాయం |
557 | మిడుకుడు | ఈర్శ |
558 | గడ్డపార | మొగులు |
559 | శిర్రగోనె | గూటి బిల్ల |
560 | సాన్పి | కళ్ళాపి |
561 | పొద్మీకి | సాయంకాలం |
562 | బుగ్గ | బల్బు |
563 | పైలు | ఒకటో తేది |
564 | బేస్తారం | గురువారం |
565 | ఐతారం | ఆదివారం |
566 | బిరాన | తొందరగా |
567 | మలాస | ఎక్కువ |
568 | ఏంటికి | ఎందుకు |
569 | గులగుల | చెక్కిలిగింతలు |
570 | నడ్మ | మధ్యలో |
571 | ఆల్చం | లేటు |
572 | అసంతకు | పక్కకు |
573 | సైసు | ఆగు |
574 | అద్దాలు | కళ్ళజోడు |
575 | అట్లనా | అవునా |
576 | ఇల్టెపల్లుడు | ఇల్లరికపు అల్లుడు |
577 | తియ్యి | తీయు |
578 | శాతాడు | చేతాడు |
579 | పోతడు | వెళ్ళగలడు |
580 | అస్తడు | వస్తాడు |
581 | మొగురం | ఇంటిలో స్తంభం |
582 | ఆసం | పైకప్పు కర్ర |
583 | నడ్డి | నడుము |
584 | చెడ్డి | డ్రాయరు |
585 | ఎడ్డి | తెల్విలేని తనం |
586 | దుడ్లు | పైసలు |
587 | అడ్లు | వరి ధాన్యం |
588 | మడి | భూమి గుంట |
589 | గుత్త | ఒక్క మొకాన |
590 | సగురం | కొప్పుకు జతపరిచేది |
591 | అందాద | సుమారు |
592 | ఆయిల్ల | క్రితం రాత్రి |
593 | కడ్డు | మొండి |
594 | నసీవ | అదృష్టం |
595 | ఎగిర్తం | తొందర |
596 | ఎచ్చిరికం | అతి |
597 | బరివాత | నగ్నం |
598 | అర్ర | స్టోర్ రూమ్ |
599 | నిరుడు | క్రితం సంవత్సరం |
600 | సై చూడు | రుచి చూడు |
601 | ఇమానం | ఒట్టు |
602 | పెయిసబ్బు | స్నానం సబ్బు |
603 | కుత్తెం | ఇరుకు |
604 | బల్లిపాతర | బూజు |
605 | బుక్కుట | తినుట |
606 | తుట్టి | నష్టం |
607 | ఓరకు పెట్టుట | దాచి పెట్టుట |
608 | తట్టి | పళ్లెం |
609 | మత్తి | పొగరు |
610 | ఎకసెక్కాలు | పరాష్కాలు |
611 | ఇకిలించుట | నవ్వుట |
612 | గలుమ | గడప |
613 | కాకిరి బీకిరి | గజిబిజి |
614 | బుజ్జగించి | లాలించి |
615 | ప్రభోజనం | ఫంక్షన్ |
616 | గుత్పలు | పెద్ద కర్రలు |
617 | దుడ్లు | డబ్బులు |
618 | పజీత | సతాయించడం |
619 | మెడకొడం | వెంబడి తగలడం |
620 | లెంకుట | వెతుకుట |
621 | ఊకుట | ఊడ్వడం |
622 | లాగం | అలవాటు |
623 | ఉల్లెక్కాలు | పరిహాసం |
624 | బరివాతల | దిగంబరంగా |
625 | శవ్వా | చీచీ |
626 | పట్టగొల్సులు | కాళ్ళ వెండిపట్టీలు |
627 | కార్జం | మేక కాలెయం |
628 | సోల్‌పూత | వరుసగా |
629 | ఉల్లుల్లు | వదులుగా చేయుట |
630 | డల్లు | కొద్దిసేపు |
631 | లాలపోయుట | స్నానం పోయుట |
632 | సల్లు | నీరు కారుట |
633 | పాసంగం | బరువులో తేడా |
634 | గతుకులు | ఎగుడు దిగుడు |
635 | గడ్కోటి | గడియకోసారి |
636 | దస్కుట | కుంగిపోవుట |
637 | పొతం | చక్కగా అమర్చడం |
638 | సనుగు | ఒక వస్తువు |
639 | దొరింపు | సమకూర్చుట |
640 | సుమీ | హెచ్చరిక చేయడం |
641 | నివద్దే | నిజమే |
642 | కీస్ పిట్ట | విజిల్ |
643 | పీక | బూర |
644 | పుడా | ప్యాకెట్ |
645 | సలువలు | చెమటలు |
646 | మాడ | తలపై భాగం |
647 | గొట్టు | కఠినమైన |
648 | బర్ర | గాయపు మచ్చ |
649 | పులగండు | తిండిబోతు |
650 | అగడు | అత్యాశ |
651 | మార్వానం | రెండో పెళ్ళి |
652 | చిలుము | తుప్పు |
653 | పుర్సత్ | నిమ్మలం |
654 | పిసరు | చిన్నముక్క |
655 | పిడాత | అకస్మాత్తుగా |
656 | తెరువకు | జోలికి |
657 | యాట | గొర్రె/మేక |
658 | మొగురం | కర్ర స్తంభం |
659 | ఇసురుగ | గొప్పగా |
660 | సిన్నగా | మెల్లగా |
661 | రంది | బాధ |
662 | పసిది | చిన్నది |
663 | బోళ్ళు | గిన్నెలు |
664 | ఇడుపు | విడాకులు |
665 | పొద్దుగాల | వేకువ జామున |
666 | అగ్గువ | చౌక |
667 | బయాన | అడ్వాన్సు |
668 | మడిగె | దుకాణం |
669 | బీమారి | రోగం |
670 | సోల | కిలో |
671 | సంత | అంగడి |
672 | ఇనాం | బహుమతి |
673 | తలె | పళ్ళెం |
674 | పత్తాలాట | పేకాట |
675 | ముచ్చెట్లు | మాటలు |
676 | అక్కెర | అవసరం |
677 | ఏశాలు | నాటకాలు |
678 | కట్టె సర్సుడు | బిగుసుకుపోవడం |
679 | కమిలింది | కందిపోయింది |
680 | గద్దరించు | గట్టిగా అరుచు |
681 | గట్లనే | అట్లాగే |
682 | గతిమెల్ల | దిక్కులేని |
683 | గర్క | గరిక |
684 | గాయింత పని | మిగిలిన పని |
685 | గంతే | అంతే |
686 | గుత్తేదారు | కాంట్రాక్టరు |
687 | గుత్ప | దుడ్డుకర్ర |
688 | గొర్రెంక | గోరువంక |
689 | గోలం | నీళ్ల తొట్టి |
690 | తిత్తి | తోలు సంచి |
691 | తువాల | తుండు గుడ్డ |
692 | తత్తర | తడబడు |
693 | తుంట | దుంగ |
694 | తోలుడు | నడపడం |
695 | తోల్కపోవు | తీసుకెళ్లుుంట |
696 | తోల్కపోవు | తీసుకెళ్లు |
Exhaustive list. Thank you for the painstaking effort
రిప్లయితొలగించండిధన్యవాదాలు మిత్రమా. Thank you very much for your kind words.
తొలగించండి