Full width home advertisement

Post Page Advertisement [Top]

తెలంగాణా పదకోశం


ఈడ మన పదాలు, వాటి వాడుక అర్దాలు ఉన్నయ్, ఇడ లేని, మీకు తెలిసిన తెలంగాణ మాటలు కూడా చెప్పాలనుకుంటుర్రా ఐతే గీ లింక్ వొత్తుర్రి. ఏం భయం అక్కర లే, ఇది మంచోల్ల చేతుల్లనే ఉన్నది.

1  తూటు   రంధ్రం
2  ఏతులు   గొప్పలు
3  మలుపు   మూల
4  తాపతాపకు   మాటిమాటికి
5  జల్ది   త్వరగా
6  కొత్తలు   డబ్బులు
7  ఏంచు   లెక్కించు
8  నాదాన   బలహీనం
9  నప్పతట్లోడు  పనికి మాలినవాడు
10  ల్యాగ   ఆవు దూడ
11  గుపాయించు  జొరబడు
12  కూకొ   కూర్చో
13  కూనం   గుర్తు
14  మడిగ   దుకాణం
15  పొట్లం   ప్యాకింగ్
16  బత్తీసలు   అప్పడాలు
17  పతంగి   గాలిపటం
18  సోంచాయించు  ఆలోచించు
19  పయఖాన   టాయిలెట్
20  మోసంబి   బత్తాయి
21  అంగూర్   ద్రాక్ష
22  కష్‌కష్   గసాలు
23  కైంచిపలంగ్   మడత మంచం
24  చెత్రి   గొడుగు
25  కల్యామాకు   కరివేపాకు
26  మచ్చర్‌దాన్   దోమతెర
27  మడుగుబూలు  మురుకులు
28  జమీర్‌ఖాన్   భూస్వామి
29  జాగా   స్థలం
30  తండా   చల్లని
31  గర్మి   వేడి
32  వూకె   ఉట్టిగా
33  సిలుం   తుప్పు
34  నియ్యత్   నిజాయితీ
35  తపాలు   గిన్నె
36  తైదలు   రాగులు
37  పలంగి   మంచము
38  బలంగ్రి   డ్రాయింగ్ రూం
39  సల్ప   నున్నని రాయి
40  దప్పడం   చారు
41  గెదుముట   పరిగెత్తించుట
42  తొక్కు   పచ్చడి
43  కిసా   జేబు
44  సల్ల   మజ్జిగ
45  అర్ర   గది
46  బుడ్డలు   పల్లీలు
47  గడెం   నాగలి
48  గాండ్లు   బండి చక్రాలు
49  కందెన   ఇంధనం
50  ఉప్పిండి   ఉప్మా
51  చిమ్ని   బుగ్గదీపం
52  తపుకు   ప్లేటు
53  ముగ్గ   చాలా
54  కందీలు   లాంతరు
55  బటువు   ఉంగరం
56  బాండ్లి   మూకుడు
57  సలాకి   అట్లకాడ
58  ఈలపీట   కత్తిపీట
59  గనుపట్ల   గడప దగ్గర
60  గుండ్లు   రాళ్ళు
61  సల్వ   చల్లదనం
62  ఏట కూర   మేక మాంసం
63  గాలిపంక   ఫ్యాను
64  షాపలు   చేపలు
65  సౌంర్త పండుగ  పుష్పాలంకరణ
66  కుమ్మరావి   కుండలబట్టి
67  లోట   డబ్బ
68  ఇడుపు   గోడంచు
69  సౌరం   క్షవరం
70  శిబ్బి   తీగల జల్లెడ
71  శిరాపురి   పరమాన్నం
72  తీట   కోపం
73  పటువ   కుండ
74  తలె   పల్లెం
75  పొర్క   చీపురు
76  సపారం   పందిరి
77  సర్కార్ ముల్లు  కంపముల్లు
78  దేవులాడు   వెతుకు
79  వాగు   నది
80  సడాకు   రోడ్డు
81  చిత్పలకాయ  సీతాఫలం
82  ఏమది   ఏమిటి
83  లచ్చమ్మ   లక్ష్మమ్మ
84  రామండెం   రామాయణం
85  తక్కడి   త్రాసు
86  గంటె   చెంచా
87  కాందాని   పరువు
88  బూగ   తూనీగ
89  సందుగు   పెట్టె
90  బిటాయించు  కూర్చోమను
91  జొన్న గటుక  జొన్న గింజల అన్నం
92  కంచె   సరిహద్దు
93  లైయ్   అతికించే పదార్థం
94  బాపు   నాన్న
95  ఆనతి   అభయం
96  సోలుపు   వరుస
97  పీనోడు   పెండ్లి కొడుకు
98  దురస్తు   బాగుచేయు
99  శిరాలు   మెడ
100  ఆర్సీలు   కళ్ళజోడు
101  మక్కెండ్లు   మొక్కజొన్న
102  సుట్టాలు   బంధువులు
103  మాలస   ఎక్కువ
104  కైకిలి   కూలి
105  కొయ్‌గూర   గొంగూర
106  కూడు   అన్నం
107  అసంత   దూరంగ
108  సిబ్బి   గుల్ల
109  పావుడ   పార
110  సలమల   వేడిలో మరగడం
111  ఊకో   కాముగా ఉండు
112  జల్దిరా   తొందరగా రా
113  తపుకు   మూత
114  తువ్వాల   చేతి రుమాలు
115  లాగు   నెక్కరు
116  కాయిసు   ఇష్టం
117  బుగులు   భయం
118  ఉర్కుడు   పరుగెత్తుడు
119  శానా   చాల
120  గట్లనే   అలాగే
121  గిట్లాంటి   ఇలాంటి
122  బర్కత్   లాభం
123  కుసో   కూర్చొండి
124  తర్జుమా   అనువాదం
125  నెరసు   చాలా చిన్నదైన
126  బకాయి   చెల్లించవలసిన మొత్తం
127  తోఫా   కానుక
128  ఇలాక   ప్రాంతం
129  బరాబరి   సరి సమానం
130  ఉసికే   ఇసుక
131  తోముట   రుద్దుట
132  గీరె   గిరక
133  బొంది   శరీరం
134  ఉలికిపడుట   అదిరిపడుట
135  ఈడు   వయసు
136  జోడు   జంట
137  గోడు   లొల్లి
138  అల్లుట   పురి వేయుట
139  నుల్క   మంచానికి అల్లే తాడు
140  శెల్క   తెల్లభూమి
141  మొల్క   పుట్టిన మొక్క
142  శిల్క   చిలుక
143  పల్కు   మాట్లాడు
144  ఈతల   ఈవల
145  ఆతల   ఆవల
146  తను   అతడు
147  దిడ్డి ధర్వాజ   మరో ద్వారం
148  కొట్టం   పశువుల పాక
149  గూటం   పశువుల కట్టేసే గుంజ
150  పగ్గం   తాడు
151  శాయిపత్తి   తేయాకు
152  పెంక   పెనం
153  సుంకం   పన్ను
154  లెంకు   వెతుకు
155  తొంట చెయ్యి   ఎడమ చెయ్యి
156  తక్కెడు   ముప్పావు కిలో
157  నడిమీలకు   మధ్యలకు
158  పుండు కోరుడు   వివాదాస్పదుడు
159  పత్యం   నియమాహారం
160  పాకులాడు   ప్రయత్నించు
161  పగిటీలి   పగటి పూట
162  పొడవూత   పొడవునా
163  పొద్దుగాల   ఉదయం
164  బరిగె   బెత్తం
165  బంజరు   ప్రభుత్వ భూమి
166  దెంకపోవుట   పారిపోవుట
167  నజీబ్   అదృష్టం
168  మాలేస్క   ఎక్కువ
169  మతులాబ్   విషయం
170  మనుండంగ   ప్రాణంతో ఉండగ
171  సటుక్కున   తొందరగా
172  సముదాయించుట   నచ్చ జెప్పుట
173  సైలేని   చక్కగా లేని
174  ఇకమతు   ఉపాయం
175  ఎక్క   దీపం
176  ఆలి   పెండ్లం
177  దుత్త   చిన్న మట్టి కుండ
178  ఎళ్ళింది   పోయింది
179  గైండ్ల   వాకిట్ల
180  తలగాయిండ్ల  వాకిలి ముందు
181  అంబలి   జావ
182  దప్పడం   సాంబారు, పప్పుల పులుసు
183  కుడుము   ఇడ్లీ
184  ఎసల   వండులకు ఉపయోగించే కుండ
185  నాలె   నేల
186  ఓరకు   పక్కకు
187  ఒల్లె   చీర
188  తాతిపారం   మెల్లగ
189  ఎరుక   తెలుసు
190  మొరగు   అరచు
191  అంబాడు   చిన్నపిల్లల పాకుడు
192  అర్సుకొనుట  పరామర్శించుట
193  ఊసు   కండ్ల నుండి వచ్చే మలినం
194  ఎటమటం   అస్తవ్యస్తం
195  ఎఱ్ఱ   వానపాము
196  చిలుక్కొయ్య  కొక్కెము
197  గులుగుట   లోలోపల మాట్లాడుట
198  గువ్వము   గుజ్జు
199  జీవిలి   చెవిలోని మలినం
200  జోకు   తూకం
201  తాంబాళం   పెద్ద పళ్ళెం
202  నసుకు   చెప్పుటకై వెనకాముందాడుట
203  నెరి   పూర్తిగా
204  బీరిపోవు   ఆశ్చర్యపడు
205  మాగికాలం   పగలు తక్కువగా ఉండే కాలం
206  వొయ్య   పుస్తకం
207  సోయి   స్పృహ
208  బిశాది   విలువ
209  పతార   పలుకుబడి
210  పజీత   పరువు
211  సాపిచ్చుట   తిట్టుట
212  పస్కలు   కామెర్లు
213  గౌర   గరాటు
214  గాసం   దాన
215  బల్గం   బంధుజనం
216  సొరికి   సొరంగం
217  సౌలతు   వసతి
218  బోలెడు   చాల
219  ఓపాలి   ఓసారి
220  యాల్ల   సమయం
221  కారటు   ఉత్తరం
222  డోకు   వాంతి
223  టప్పా   పోస్టు
224  సూటి   గురి
225  సోల్తి   జాడ
226  సోపతి   స్నేహం
227  ఎర్కలే   జ్ఞాపకం లేదు
228  ఉత్తగ   ఊరికే
229  నువద్ది   నిజంగా
230  పైలం   జాగ్రత్త
231  శరం   సిగ్గు
232  ఛిద్రం   రంధ్రం
233  మతలబు   విషయం
234  ఎండ్రికాయ   పీత
235  జబర్‌దస్తీ   బలవంతం
236  కనరు   వెగటు
237  ఇడిసిపెట్టు   వదిలిపెట్టు
238  గత్తర   కలరా
239  ఇగురం   వివరం
240  పరదా   తెర
241  గుర్రు పెట్టుట  గురక పెట్టుట
242  గులగుల   దురద
243  గులాం   బానిస
244  గిచ్చుట   గిల్లుట
245  పిసరంత   కొద్దిగా
246  గుత్త   మొత్తం ఒకేసారి
247  గుండిగ   వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర
248  శిట్టశిట్ట   తొందరగా
249  బర్ఖతక్కువ   వృద్దిలేని
250  వుర్కు   పరుగెత్తు
251  సర్రున   వెంటనే
252  మొస   శ్వాస
253  బుదగరింపు  ఓదార్పు
254  ఓమానంగా   అతి కష్టంగా
255  గల్మ   ద్వారం
256  పొల్ల   అమ్మాయి
257  ఆయమన్న   ఉన్నదాంట్లో మంచిది
258  లొల్లి చప్పుడు
259  ఇషారా   వివరాలు
260  కారెడ్డెం   మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం
261  దూప   దాహం
262  తొవ్వ   దారి
263  లగ్గం   పెళ్ళి
264  ఏసిడి   చెడుకాలం
265  జరంత   కొద్దిగా
266  పైలం   పదిలం
267  యాదుందా   జ్ఞాపకం ఉందా
268  ఎక్కిరింత   వెక్కిరించుట
269  సవుసు   ఆగు
270  చితల్‌పండు   సీతాఫలం
271  కాలం చేసుడు  మరణించుట
272  మస్తుగ   మంచిగ
273  నిరుడు   గత సంవత్సరం
274  పోవట్టిన   వెళ్తున్న
275  పొద్మికి   సాయంత్రం
276  ఉత్తగ   ఊరకే
277  బుదగరిచ్చి   బతిలాడి
278  యాష్ట   విసుగు
279  తెగదెంపులు  విడాకులు
280  సాయిత   దంట
281  లొల్లి   గోల
282  పాయిద   లాభం
283  తోడెం   కొంచెం
284  భేట్   కలయిక
285  కీలు   తాళం
286  ఫకత్   ఎల్లప్పుడు
287  పంఖా   విసనకర్ర
288  గూసలాట   పొట్లాటా
289  ఝగడ్   జగడం
290  నిత్తె   ప్రతి దినం
291  గాయి   అల్లరి
292  సెక   మంట
293  మస్కున   మసక చీకటిలో
294  తోగరుపప్పు  కందిపప్పు
295  అయి   అమ్మ
296  గాడికా   అక్కడికా
297  లెంకుట   వెదుకుట
298  పక్కా   నిశ్చయము
299  ఉండి   వరకట్నం
300  బుడ్డోడు   చిన్నవాడు
301  మెత్త   దిండు
302  అడ్డెనిగా   భోజన స్లాండు
303  పదిలెము   క్షేమం
304  సర్వపిండి   కారం రొట్టె
305  బొక్కెన   నీరుతోడే బక్కెట్
306  వొర్రకు   అరువకు
307  గౌసెను   దిండు కవరు
308  కైకిలి   కూలీ
309  చెల్క   వర్షధార పొలం
310  గౌడి   కోట
311  ముల్లె   మూట
312  దర్వాజ   తలుపు
313  కొట్టము   గోశాల
314  తనాబ్బి   షెల్పు
315  ముంత   చెంబు
316  ఉరుకు   పరుగెత్తు
317  ఆత్రము   తొందర
318  సౌసు   ఆగు
319  శిబ్బి   అన్నం వంపే మూత
320  తల్లి గుంజ   పెళ్ళి పందిరికి తల్లి వంటిది
321  లగ్గం   పెండ్లి
322  నాగెల్లి   నాగవెల్లి
323  పైలము   జాగ్రత్త
324  దౌతి   సిరాబుడ్డి
325  ఎగిర్త   తొందర
326  అడ్లు   వరిధాన్యం
327  పుస్తె   తాళి
328  నొసలు   లలాటము
329  తోల్త   పంపిస్త
330  బాట   దారి
331  మంకు   బుద్ధిమాంద్యం
332  పత్త   చిరునామా
333  ఇకమత్   తెల్వి
334  తకరారు   సతాయించుడు
335  తోడం   కొంచెం
336  పడిశం   సర్ధి
337  బలుపు   మదము
338  కండువ   టవల్
339  అంగి   చొక్కా
340  బౌగొనె   గిన్నె
341  బువ్వ   అన్నం
342  ఎయ్యి   పెట్టు
343  గూడు   సెల్ఫ్
344  నెత్తి   తల
345  వర్రుడు   బాగా మాట్లాడు
346  ఉరికిరా   పరిగెత్తుకుని రా
347  మాలెసా   బాగా
348  మడిగెలు   షెట్టర్లు
349  నూకు   వుడ్చుడు
350  ఉబ్బర   ఉక్కపోత
351  యాడికి   ఎక్కడికి
352  కుకొ   కూర్చుండు
353  జర ఆగు   కొద్దిగుండు
354  కంకలు   ఎడ్లు
355  మొగులు   ఆకాశం
356  మలగడం   తిరగడం
357  దబ్బన   తొందర
358  మారాజ్   పూజారి
359  లడిక   గరాటు
360  శారాన   పావుల
361  బారాన   మూడు పావులాలు
362  కుర్స   పొట్టి
363  మోటు   గడుసు
364  గోసి   పంచ
365  బాపు   తండ్రి
366  కాక   బాబాయి
367  పెదబాపు   పెద్ద నాన్న
368  పెద్దాయి   పెద్దమ్మ
369  యారాలు   తోటి కోడలు
370  సడ్డకుడు   తోడల్లుడు
371  సాలెగాడు   బావమర్ది
372  తమ్మి   తమ్ముడు
373  దన్ననరా   త్వరగా రా
374  జల్దిరా   జెప్పున రా
375  ఊకో   ఆగు
376  సోపాల   ఒడి
377  ఓమాడి   పొదుపు
378  పురాత   పూర్తిగా
379  పైలంగరా   మెల్లగ రా
380  ఆడికేంచి   అక్కడి నుండి
381  లగు   బలుపు
382  పరేషాన్   అలసట
383  ఇమ్మతి   సాయం
384  ఇమాకత్   గర్వం
385  జాతర   తీర్ధం
386  పనుగడి   కొష్టం దరువాజ
387  సిడీలు   మెట్లు
388  తట్టి   పళ్ళెం
389  ఊరబిస్క   ఊరపిచ్చుక
390  ఆవలికి   బయటకు
391  పాయిరం   పావురం
392  ఆయేటిబూనంగ   తొలకరి
393  సడుగు   రోడ్డు
394  దొరింపు   మార్గం
395  కుందాపన   దిగులు
396  పిడుస   ముద్ద
397  దుబ్బ   మట్టి
398  చెండు   బంతి
399  బగ్గ   బాగా
400  బొచ్చెడు   చాలా
401  యాపాకులు  వేపాకులు
402  గాయిదోడు   ఆవారా
403  నడిమిట్ల   మధ్యన
404  సూరు   చూరు
405  పయ్య   చక్రం
406  ఒంటేలు   మూత్రం
407  రాతెండి   అల్యూమినియం
408  బర్మా   రంధ్రాలు చేసే సాధనం
409  ఇగురం   ఉపాయం
410  దిడ్డి   కిటికీ
411  ఇల వరుస   పద్ధతి
412  బుట్టాలు   లోలాకులు
413  గరిమి   వేడి
414  కచ్చురం   ఎడ్ల బండి
415  పెనిమిటి   భర్త
416  గలుమ   తలుపు
417  తల్వాలు   తలంబ్రాలు
418  పరాశికం   నవ్వులాట
419  మబ్బుల   వేకువ జామున
420  చిడిమెల   తొందరగా
421  కాపాయం   పొదుపు
422  యవ్వారం   వ్యవహారం
423  అలిమిబలిమి  ఇష్టాయిష్టాలు
424  మనాది   బెంగ
425  ఎటమటం   బెడిసికొట్టు
426  రంది   దిగులు
427  సడుగు   తొవ్వ
428  బాలకాలి   పిల్ల చేష్టలు
429  అగ్వ   చౌక
430  గాడ్పు   గాలి
431  ఇంగలం   నిప్పు
432  మాల్‌గాడి   గూడ్సు బండి
433  ఎక్వ తక్వ   హెచ్చుతగ్గులు
434  గిర్వి   తాకట్టు
435  కొలువు   నౌకరు
436  పాలోళ్ళు   దాయాదులు
437  పొద్దుగూకి   సాయంత్రం
438  జంగుబట్టింది  తుప్పుబట్టింది
439  మొగురం   కట్టెస్తంభం
440  గావురం   ప్రేమ
441  ఒద్దులు   దినములు
442  గలుమ   ద్వారము
443  లగాంచి   జోరుగా
444  రికాం   తీరిక
445  సుంసాం   నిశ్శబ్దం
446  తట్టు   గోనె సంచి
447  తొట్టె   ఊయల
448  ఇగం   అతి చల్లని
449  గవాబు   సాక్ష్యం
450  పైకం   డబ్బులు
451  తపుకు   మూత గిన్నె
452  సుతారం   సున్నితం
453  తోలుట   నడుపుట
454  కోల్యాగ   ఆవుదూడ
455  సొక్కంపూస  నీతిమంతుడు
456  బుదగరించుట  బుజ్జగించుట
457  బరివాత   నగ్నంగ
458  కోసులు   మైళ్ళు
459  తనాబ్బి   కప్ బోర్డు
460  వరపూజ   నిశ్చితార్థం
461  రయికె   జాకెట్టు
462  తనాబి   షెల్ఫ్
463  తంతెలు   మెట్లు
464  ఆనక్కాయ   సొరకాయ
465  కలెగూర   తోటకూర
466  తొక్కు   ఊరగాయ
467  బుక్కెడు   ఒక ముద్ద
468  గంటే   గరిటే
469  గరిమికోటు   రెయిన్ కోటు
470  గంజు   వంట పాత్ర
471  రంజన్   కూజ
472  నూతి   బావి
473  గడెంచే   నులకమంచం
474  అవతల   ఆరు బయట
475  గొడిసేపు   కాసేపు
476  నిరుడు యేడు  గత సంవత్సరం
477  కల్ప   మంగలి పెట్టే
478  టొక్క   పారిపోవడం
479  పత్తి   పాళీ
480  కందిలి   చిన్న దీపం
481  పొంతన   పోలిక
482  మోపున   జాగ్రత్తగ
483  పోగులు   కుప్పలు
484  ఎటమటం   పొరపాటు
485  సర్సుట   కొట్టుట
486  కాన్గి బడి   ప్రైవేటు బడి
487  మర్లబడుట   తిరగబడుట
488  తాషిలి   కీడు
489  కాంచి   సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట
490  దడ్లబురి   మగ కోతి
491  మొస   అధిక శ్వాస
492  డొక్క   కడుపు
493  అముడాల   కవల
494  ఆపతి పడుట  ప్రసవ వేదన
495  ఇగం   చల్లగ, హిమం
496  ఇడుపులు   ప్రవేశ ద్వార ప్రాంతం
497  ఇమానం   ప్రమాణం
498  ఎనుగు   ముండ్ల కంచె
499  ఏతులు   హెచ్చులు, గొప్పలు
500  బగరుకొట్టుట  వేగంగా శ్వాసించుట
501  కంచె   గడ్డి బీడు
502  కైలాట్కం   కలహం, కొట్లాట
503  జిట్టి   దృష్టి
504  జిమ్మ   జిహ్వ
505  తుత్తుర్లు   వెంట్రుకలు
506  దంచుట   దండించుట, కొట్టుట
507  దంగుట   తఱుగుట
508  నీయత్   నిజాయితీ
509  పాసంగం   మొగ్గు
510  పురుసత్   విశ్రాంతి
511  మిత్తి   వడ్డి
512  ఆయిటి   తొలకరి
513  ఇగురు   చిగురు
514  ఇగురం   వ్యూహం
515  ఇగ్గుట   సంకోచించుట
516  ఇచ్చంత్రం   విచిత్రం
517  ఒళ్ళక్కం   అబద్దం
518  కువారం   చెడ్డబుద్ధి
519  కైగట్టుట   కవిత్వం రాయుట
520  దసుకుట   కుంగుట
521  నక్కు   అతుకు
522  నాదాను   బలహీనం
523  నేఱివడుట   అలసిపోవుట
524  పతార   పరపతి
525  పుల్లసీలుట   అలసిపోవుట
526  బొండిగ   గొంతు
527  మాల్యం   దయ గలుగుట
528  మాయిల్యమే  వెంటనే, తొందరగ
529  మోర్‌దోపు   ప్రమాదకరమైన
530  తొవ్వ   బాట
531  మంకు   మొండితనం
532  నొసలు   నుదురు
533  దొబ్బు   నెట్టు
534  దీపంత   ప్రమిద
535  రౌతు   రాయి
536  పసిరికెలు   కామెర్లు
537  ఉబ్బు   ఉత్సాహం
538  పెయ్యి   వొళ్ళు
539  అంబటియాల   అంటి తాగే సమయం
540  ఆనగపు కాయ  సోరకాయ
541  ఇసుర్రాయి   విసురు రాయి
542  ఉలువచారు   ఉలువ కట్టు
543  ఎచ్చాలు   గరం మసాలా వస్తువులు
544  ఎసరు   అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు
545  ఒత్తి పొయ్యి   పొంత పొయ్యి
546  కడువ   నీరు తెచ్చుకునే మట్టి కుండ
547  గాబు   ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది
548  గుమ్మి   నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది
549  వత్తు   కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు)
550  కురాడు   బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ
551  సాయబాన్   దంపతుల పడకగది
552  సానుపు   పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు
553  గిరుక   బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది
554  కంచుడు   పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ
555  గోరు కొయ్యలు   రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు
556  ఇకమత్   ఉపాయం
557  మిడుకుడు   ఈర్శ
558  గడ్డపార   మొగులు
559  శిర్రగోనె   గూటి బిల్ల
560  సాన్పి   కళ్ళాపి
561  పొద్మీకి   సాయంకాలం
562  బుగ్గ   బల్బు
563  పైలు   ఒకటో తేది
564  బేస్తారం   గురువారం
565  ఐతారం   ఆదివారం
566  బిరాన   తొందరగా
567  మలాస   ఎక్కువ
568  ఏంటికి   ఎందుకు
569  గులగుల   చెక్కిలిగింతలు
570  నడ్మ   మధ్యలో
571  ఆల్చం   లేటు
572  అసంతకు   పక్కకు
573  సైసు   ఆగు
574  అద్దాలు   కళ్ళజోడు
575  అట్లనా   అవునా
576  ఇల్టెపల్లుడు   ఇల్లరికపు అల్లుడు
577  తియ్యి   తీయు
578  శాతాడు   చేతాడు
579  పోతడు   వెళ్ళగలడు
580  అస్తడు   వస్తాడు
581  మొగురం   ఇంటిలో స్తంభం
582  ఆసం   పైకప్పు కర్ర
583  నడ్డి   నడుము
584  చెడ్డి   డ్రాయరు
585  ఎడ్డి   తెల్విలేని తనం
586  దుడ్లు   పైసలు
587  అడ్లు   వరి ధాన్యం
588  మడి   భూమి గుంట
589  గుత్త   ఒక్క మొకాన
590  సగురం   కొప్పుకు జతపరిచేది
591  అందాద   సుమారు
592  ఆయిల్ల   క్రితం రాత్రి
593  కడ్డు   మొండి
594  నసీవ   అదృష్టం
595  ఎగిర్తం   తొందర
596  ఎచ్చిరికం   అతి
597  బరివాత   నగ్నం
598  అర్ర   స్టోర్ రూమ్
599  నిరుడు   క్రితం సంవత్సరం
600  సై చూడు   రుచి చూడు
601  ఇమానం   ఒట్టు
602  పెయిసబ్బు   స్నానం సబ్బు
603  కుత్తెం   ఇరుకు
604  బల్లిపాతర   బూజు
605  బుక్కుట   తినుట
606  తుట్టి   నష్టం
607  ఓరకు పెట్టుట  దాచి పెట్టుట
608  తట్టి   పళ్లెం
609  మత్తి   పొగరు
610  ఎకసెక్కాలు   పరాష్కాలు
611  ఇకిలించుట   నవ్వుట
612  గలుమ   గడప
613  కాకిరి బీకిరి   గజిబిజి
614  బుజ్జగించి   లాలించి
615  ప్రభోజనం   ఫంక్షన్
616  గుత్పలు   పెద్ద కర్రలు
617  దుడ్లు   డబ్బులు
618  పజీత   సతాయించడం
619  మెడకొడం   వెంబడి తగలడం
620  లెంకుట   వెతుకుట
621  ఊకుట   ఊడ్వడం
622  లాగం   అలవాటు
623  ఉల్లెక్కాలు   పరిహాసం
624  బరివాతల   దిగంబరంగా
625  శవ్వా   చీచీ
626  పట్టగొల్సులు   కాళ్ళ వెండిపట్టీలు
627  కార్జం   మేక కాలెయం
628  సోల్‌పూత   వరుసగా
629  ఉల్లుల్లు   వదులుగా చేయుట
630  డల్లు   కొద్దిసేపు
631  లాలపోయుట  స్నానం పోయుట
632  సల్లు   నీరు కారుట
633  పాసంగం   బరువులో తేడా
634  గతుకులు   ఎగుడు దిగుడు
635  గడ్కోటి   గడియకోసారి
636  దస్కుట   కుంగిపోవుట
637  పొతం   చక్కగా అమర్చడం
638  సనుగు   ఒక వస్తువు
639  దొరింపు   సమకూర్చుట
640  సుమీ   హెచ్చరిక చేయడం
641  నివద్దే   నిజమే
642  కీస్ పిట్ట   విజిల్
643  పీక   బూర
644  పుడా   ప్యాకెట్
645  సలువలు   చెమటలు
646  మాడ   తలపై భాగం
647  గొట్టు   కఠినమైన
648  బర్ర   గాయపు మచ్చ
649  పులగండు   తిండిబోతు
650  అగడు   అత్యాశ
651  మార్వానం   రెండో పెళ్ళి
652  చిలుము   తుప్పు
653  పుర్సత్   నిమ్మలం
654  పిసరు   చిన్నముక్క
655  పిడాత   అకస్మాత్తుగా
656  తెరువకు   జోలికి
657  యాట   గొర్రె/మేక
658  మొగురం   కర్ర స్తంభం
659  ఇసురుగ   గొప్పగా
660  సిన్నగా   మెల్లగా
661  రంది   బాధ
662  పసిది   చిన్నది
663  బోళ్ళు   గిన్నెలు
664  ఇడుపు   విడాకులు
665  పొద్దుగాల   వేకువ జామున
666  అగ్గువ   చౌక
667  బయాన   అడ్వాన్సు
668  మడిగె   దుకాణం
669  బీమారి   రోగం
670  సోల   కిలో
671  సంత   అంగడి
672  ఇనాం   బహుమతి
673  తలె   పళ్ళెం
674  పత్తాలాట   పేకాట
675  ముచ్చెట్లు   మాటలు
676  అక్కెర   అవసరం
677  ఏశాలు   నాటకాలు
678  కట్టె సర్సుడు   బిగుసుకుపోవడం
679  కమిలింది   కందిపోయింది
680  గద్దరించు   గట్టిగా అరుచు
681  గట్లనే   అట్లాగే
682  గతిమెల్ల   దిక్కులేని
683  గర్క   గరిక
684  గాయింత పని   మిగిలిన పని
685  గంతే   అంతే
686  గుత్తేదారు   కాంట్రాక్టరు
687  గుత్ప   దుడ్డుకర్ర
688  గొర్రెంక   గోరువంక
689  గోలం   నీళ్ల తొట్టి
690  తిత్తి   తోలు సంచి
691  తువాల   తుండు గుడ్డ
692  తత్తర   తడబడు
693  తుంట   దుంగ
694  తోలుడు   నడపడం
695  తోల్కపోవు   తీసుకెళ్లుుంట 
696  తోల్కపోవు   తీసుకెళ్లు

2 కామెంట్‌లు:

Bottom Ad [Post Page]