Full width home advertisement

Post Page Advertisement [Top]

Mic TV సంక్రాంతి పాట

భోగిమంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు
హరిదాసులు, బసవడాటలు, భోగిపండ్లతో దీవెనలు
ఇది మూడు రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు
ఇటు పిండి వంటల ఘుమఘుమలు.. అటు బొమ్మల కొలువుల సరిగమలు

హే రంగు పతంగి వచ్చింది. నింగి  సింగిడి అయ్యింది హే. చల్ చరక్  తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో 
హే పాత బస్తీకి జావో... హే దూళ్ పేటకు జావో  హే  ఇటు మాంజా  లేజా... లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో
ఆ.. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే... ఉత్తరాన భానుడు నిలిచాడే

ఈ మకర రాశి లోకి అడుగు వేసే... తన దిశను నేటితో మార్చేసే
చెట్లు పూలను పూసేలే... పండ్లు నిండుగా కాసేలే...
ఇంట్లో పంటలు నిండే .. పశువులు పాడిని చిందే..
బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే...   సంక్రాంతి ఇంటికి వచ్చేసే...
గుండె వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే... జ్ఞాపకాల ముద్దరలేసే...

హే చిచ్చా లచ్చా మారేంగే   హే గోల్కొండకు జాయేంగే. హే.. మచ్చా డీల్ మారేంగే.. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో 
హే మేరా ప్లాస్టిక్ మాంజా ... హే తేరా నైలాన్ మాంజా..  హే  .. మామ పేంచ్ కి ఆజా... కీంచ్, కాంట్ ఆఫా.. కరేంగే..   లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

భోగి మంట భాగ్యం. వెచ్చనైన రాగం.  మకరరాశి తొంగి చూసి ఆయుష్షు పోసే...
కనుమనాటి యోగం,.. గోవులకు స్నానం.  పశువుల పాదాలు మొక్కి రైతు తరించే..
కడప వీధులు కనుమకు కదం తోక్కెగా.. ఒంగోలు లో గిత్తలు పోటికురిగేగా
పల్లెల్లో ముగ్గుల పందెం.. భూమికే అద్దెను అందం.  గొబ్బెమ్మలు చుట్టూ గానం ఆడబిడ్డలు చేసే
దైవమిచ్చే దీవేనలీనాదేలే... కష్టం మరిచి కళ్ళు మెరిశాయే.. ఇండ్లు ఇంధ్రధనస్సులయ్యాయే...

హే... చల్ డబీర్ పుర.. హే... నడువ్  దూద్ బౌళి..  హే.. మంచి పతంగి తెద్దాం... లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో
హే  చల్ పోటీకి పోదాం.. హే.. దిల్ జీతాయిద్దాం... హే.. దమ్ము చూపించొద్దాం.. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

భోగి తెచ్చే భోగం.. నువ్వుల నూనె స్నానం.  కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం
సమర రణ నినాదం .. పందెం కోళ్ళ పందెం. భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం.
పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చేగా... రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చేగా
మంచుతో కప్పిన చెట్లు.... అందాల ముగ్గుల మెట్లు...  కన్నతల్లి పిలిచినట్టు రా రమ్మని పిలిచే
గుండె ఎగిరి పుట్టినింట వాలేలే ... పుట్టిన ఊరు చూసి నయనాలే.. కృష్ణా గోదావరి నదులాయే.. కృష్ణా గోదావరి నదులాయే..

ఆ.. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే... ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోనికి అడుగు వేసే... తన దిశను నేటితో మార్చేసే


రచన - డా.కందికొండ  
సంగీతం - నందన్ బొబ్బిలి  
గానం - మంగ్లీ  
దర్శకత్వం - దామురెడ్డి కోసనం 

2 కామెంట్‌లు:

Bottom Ad [Post Page]