మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • నా తెలంగాణ, కోటి రత్నాల వీణ

  నా తెలంగాణ, కోటి రత్నాల వీణ


  కోటి తెలుగుల బంగారు కొండక్రింద
  పరచుకొన్నట్టి సరసు లోపల వసించి
  ప్రొద్దు ప్రొద్దున అందాల పూలుపూయు

  నా తెలంగాణ తల్లి, కంజాత వల్లి

  వేయి స్తంభాల గుడినుండి చేయి సాచి
  ఎల్లోరా గుహలందున పల్లవించి
  శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి
  నా తెలంగాణ, కోటి పుణ్యాల జాణ

  మూగవోయిన కోటి తమ్ముల గళాల
  పాట పలికించి కవితా జవమ్ము కూర్చి
  నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
  నా తెలంగాణ, కోటి రత్నాల వీణ !

                                                     -దాశరధి


 • You might also like

  2 వ్యాఖ్యలు: