మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • నాగేటి సాల్లల్ల నా తెలంగాణా By నందిని సిదా రెడ్డి  నాగేటి సాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా ,
  నవ్వేటి  బతుకులు నా తెలంగణా నా తెలంగణా!

  పారేటి నీల్లల్ల పానాదులల్ల ,  పూసెటి పువ్వుల్ల పూనాసలల్ల

  కొంగు సాపిన నేల నా తెలంగాణా న తెలంగాణా.
  పాలు దాపిన తల్లి నా తెలంగాణా ణ తెలంగాణా

  |  నాగేటి  |

  తంగేడు పువ్వుల్లు తంబాలమంత,
  తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు

  తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు,
  బంగారు చీరలు బజారులన్ని

  బతుకమ్మ పండుగ నా తెలంగానా నా తెలంగాణ,
  బంతిపూల తోట నా తెలంగాణా నా తెలంగాణా

  |  నాగేటి  |

  వరద గూడు కడితే వానొచ్చనంట బురద పొలము దున్ని మురిసున్నరంత,

  శివుని గుల్లె  నీల్లు, చీమలకు షక్కరి, వాన కొరకు భజన జడ కొప్పులేసి,

  వాగుల్ల వంకల్ల నా తెలంగాణా నా తెలంగాణా
  చూపు రాలిన కండ్లు నా తెలంగాణా నా తెలంగాణా

  |  నాగేటి  |

  కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు,
  పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు,(2)

  పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు
  జొన్న కర్రల జెండ జోరున్నదేమి,

  అలాయ్ బలాయ్ దీసె నా తెలంగాణా నా తెలంగాణా
  దుండి పంచిన ఆర్తి నా తెలంగాణా నా తెలంగాణా
  | నాగేటి  |

  మోట కొట్టే రాత్రి మోగిన పాట,
  తాడు పేనిన తండ్రి తలుపుల ఉన్న అప్పు,(2)

  తాడు పేనిన తండ్రి తలుపుల ఉన్న అప్పు
  కల్లమూడిసిన అవ్వ కలలోని గింజ(2)

  ఆరు గాలం చెమట నా తెలంగాణా నా తెలంగాణా
  ఆకలి దప్పుల మంట నా తెలంగాణా నా తెలంగాణా

  | నాగేటి  |

  ఊరు కాసె తల్లి ఉరిమి సూడంగ,
  బువ్వ లేని తల్లి బోనం వండింది(2)

  బువ్వ లేని తల్లి బోనం వండింది
  సేను కొచ్చిన పురుగు సెరిగి పూసింద,(2)

  బోనాల పండుగ నా తెలంగాణా నా తెలంగాణా
  కాట్రావుల ఆట నా తెలంగాణా నా తెలంగాణా

  | నాగేటి  |

  గట్టి కట్టిన రోజు డప్పు సప్పుల్లు,
  పీరీల గుండంల పిలగాండ్ల ఆట,(2)

  పీరీల గుండంల పిలగాండ్ల ఆట
  కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుల్లు,

  వాలు పాడిన పాట నా తెలంగాణా నా తెలంగాణా
  ఆత్మ గల్ల చెయ్యి నా తెలంగాణా నా తెలంగాణా

  | నాగేటి  |

  కలిసేటి సేతుల్ల కన్నీటి పాట,   
  సిందోల్ల సిందుల్ల సిగురించె నాట్యం.(2)  

  సిందోల్ల సిందుల్ల సిగురించె నాట్యం
  ఓగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం.(2)  

  కళలకే పుట్టుక నా తెలంగాణా నా తెలంగాణా
  పాట గాచిన పట్టు నా తెలంగాణా నా తెలంగాణా

  | నాగేటి  |

  బురుజు గోడల పొగరు మెడలు వంచంగ,  
  గుట్లల్ల సెట్లల్ల గోగు పువ్వులు,(2) 

  సద్ది మొసిన తల్లి సావు బతుకుల్లు, 
  ప్రాణమిచ్చిన వీర కథలు పాడంగ(2)  

  గోరు కొయ్యల పొద్దు నా తెలంగాణా నా తెలంగాణా
  గోరింకలా  సభలు నా తెలంగాణా నా తెలంగాణా

  | నాగేటి  |

  Written By నందిని సిదా రెడ్డి 
  Sung By దేశపతి శ్రీనివాస్ 
 • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి