Full width home advertisement

Post Page Advertisement [Top]



పొద్దు పొద్దులు రెండు పొద్దుల్లె రెండు యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..             | 2 |
పొదలా మీదా ఆలిన తుమ్మెదలే రెండో యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..          | 2 |
తుమ్మెదలా సప్పుడు ఇంటె గుండె ఝల్లుమన్నాడొ నా మరదలు గుర్తుకు వచ్చినాదో ..
వరదల్లే నా మనసుల పొంగిపొరలుతున్నాదో..

||పొద్దు ||..
||పొదలా మీదా||

గంగమ్మ అలలా మీద గవ్వలు తేలినట్టో ..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
వంగిన పైరు మీద గువ్వలి ఆలినట్టో..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
నా మదిలో జేరి నా మల్లి ఆటలాడుతంది..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
గడియ కూడ నన్ను ఇడిసి ఉండలేనంటంది..నాతో సరసాలాడుతుంది..
తెల్లవారుతుంటె నాకు కలవరమనిపించింది..కలగన్నానని తెలిసింది..


||పొద్దు ||..
||పొదలా మీదా||
..

సుక్కాలన్ని పోయి సూర్యుడచ్చే యాలో..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..
ఆ పువ్వులన్ని పూసి పరిమళించే వేళో..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..
పొద్దు పొద్దునా మల్లి ముద్ద మోము సూడొ.. యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..
నిలువెత్తు నా మల్లి రూపాన్ని సూడంగ రెండు కళ్ళు సాలవాయే..
నీలాల కురులు సూత్తె మనసే నిలువదాయె.. తనువంతా తడబాటాయె..

||పొద్దు ||..
||పొదలా మీదా||

కొండా కోనల్లో కూసె కోయిలమ్మలాలో వ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
పొంగి పొర్లుతున్న వాగువంకలాలో వ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
నింగీ వైపెగురుతున్న పాల పిట్టలాలో..వ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
యాడ ఉందో నా మల్లి జాడ తెలుపరమ్మా.. నాపై జాలి సూపరమ్మా..
ఎంతాని వెతకాలమ్మా అలసి పోయానమ్మా..నా మల్లీ ఎక్కడుందమ్మా..

||పొద్దు ||..
||పొదలా మీదా||
||పొదలా మీదా||
||పొద్దు ||..

Lyric Source: http://bit.ly/Zx1gOD

2 కామెంట్‌లు:

  1. www.tdaily.in please visit this site for important news about TELANGANA and SINGARENI COALBELT area news....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఔ సంపత్ అన్న, Site పని చేస్తలెదుగా, ఇంకా ఎమన్న మంచి పాటలు నీ యాదిల ఉంటె చెప్పరాదు, ఈడ పెడదాం.

      తొలగించండి

Bottom Ad [Post Page]