తండాకు పొతాండు గుడాంబ దాగుతాండు ఈపు పలగొడ్తాండు ఇలువ దీసుకుంటాండు | 2 |
వావ్వో... అరె వాయ్యో...
అరె వావ్వో నేను వోను అత్తగారింటికి వాయ్యో నేను వోను తాగువొతోనికి
తండాకు పొతాండు గుడాంబ దాగుతాండు ఈపు పలగొడ్తాండు ఇలువ దీసుకుంటాండు
ఆకలాకలి అంటాండు .... అన్నమేయ్యి అంటాండు.... అన్నమేసినాక వాడు గిన్నేనే తన్తాండు | 2 |
వావ్వో... అరె వాయ్యో...
వావ్వో నేను వోను అత్తగారింటికి... వాయ్యో నేను వోను తాగువొతోనికి
పెద్దన్న వెట్టిన పట్టు చీరనమ్మిండు... చిన్నన్న వెట్టిన బర్రె పెయ్యనమ్మిండు... | 2 |
వావ్వో... అరె వాయ్యో...
అరె వావ్వో నేను వోను అత్తగారింటికి వాయ్యో నేను వోను తాగువొతోనికి
సూశిపోను సుట్టమొస్తే సూరు కింద కూసవెట్టి... సార దేస్తానని పోయి సడుగు మీద పొర్లుతాండు | 2 |
వావ్వో... అరె వాయ్యో...
అరె వావ్వో నేను వోను అత్తగారింటికి వాయ్యో నేను వోను తాగువొతోనికి
ఏలి మీద గొద్తడాయె... కాలు మీద గొద్తడాయె... ఎడవద్తె ఆడ గొట్టి పానమెల్ల దియ్యవట్టే | 2 |
వావ్వో... అరె వాయ్యో...
అరె వావ్వో నేను వోను అత్తగారింటికి వాయ్యో నేను వోను తాగువొతోనికి
వావ్వో నేను వోను అత్తగారింటికి వాయ్యో నేను వోను తాగువొతోనికి.........
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి