Full width home advertisement

Post Page Advertisement [Top]
గల్ గల్ సప్పుల్ల గాజులు దెత్తనే... 

రంగు రంగుల రైకలు దెత్తానే...   

గాజులేసు కోయే పిల్లా మోజులన్ని దీర...   

మంజులా...  మనసు పడితినే నీ మీద...  మరదాలా నీ మేన బావను నేగాదా 

గల్ గల్ సప్పుల్ల గాజులు దెత్తనే... 

రంగు రంగుల రైకలు దెత్తానే...

గుండీల రైక దొడిగి...  ఎడ్ల బండెక్కి నువ్ వోతుంటే

సన్నని నడుము దానా...  నిన్నిడిసి బతకనే జాన 

ఉంగరాల కురులు...  బంగారు కుచ్చు జడలు...  

మంజులా...  మనసు పడితినే నీ మీద...  మరదాలా నీ మేన బావను నేగాదా 

గల్ గల్ సప్పుల్ల గాజులు దెత్తనే... 

రంగు రంగుల రైకలు దెత్తానే...

జల్ జల్ మట్టెల దానా...  జారుడు జడలా దానా...   

నీ జబ్బల నడుమ మెరిసే...  నా గుండెల్లో వానా కురిసే... 

నీ బుగ్గ మీద మచ్చా...  నా మనసు నీకు ఇచ్చా... 

మంజులా...  మనసు పడితినే నీ మీద...  మరదాలా నీ మేన బావను నేగాదా 

గల్ గల్ సప్పుల్ల గాజులు దెత్తనే... 

రంగు రంగుల రైకలు దెత్తానే...

పైనిండ నగలు వెడతా...   పేరైనా బంగ్లా గడతా...  

నీ యేలు నేను పడత...  నీ మెడలో తాళి కడతా...  

కట్నాలు లేకుంటా...  నిన్ను పెండ్లి జేసుకుంట... 

మంజులా...  మనసు పడితినే నీ మీద...  మరదాలా నీ మేన బావను నేగాదా 

గల్ గల్ సప్పుల్ల గాజులు దెత్తనే... 

రంగు రంగుల రైకలు దెత్తానే...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]