Full width home advertisement

Post Page Advertisement [Top]

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ...  రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ...  తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా

తెలిసుంటే చెట్టంత నా కొడుకును  
తెలిసుంటే చెట్టంత నా కొడుకును  ...   తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలు

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా...  రక్త బంధం విలువ నీకు తెలియదురా

పువ్వులో పువ్వునై నీ పూజ జెశాను ... నీరునై నీ అడుగు పాదాలు కడిగాను
ఒక్కపోద్దులు ఉంటు ముడుపు చెల్లించాను ...  దిక్కు నీవని మొక్కి దీమాగ ఉన్నాను
తొలుసూరు కొడుకని ఈశ్వరా ...  నీ పేరు బెట్టుకుంటే శంకరా
తొలుసూరు కొడుకని ఈశ్వరా ...  నీ పేరు బెట్టుకుంటే శంకరా
అందుకే వేసావ ఈ శిక్షను నా కొడుకుపై నక్సలైటని మచ్చను

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా...  రక్త బంధం విలువ నీకు తెలియదురా

శివ రాత్రి నీ శిలకు నైవేద్యమైనాను ... దీపమా అరనీక పడిగాపులున్నాను
కళ్ళలో వేకువ దీవెననుకున్నను ...  కడుపులో పేగును కొస్తవనుకొలేదు
నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా ... చిన్న చీమైన కుట్టదుర శంకరా
ఎందుకని రాసావు ఈ రాతను ...  పూలు రాలిన చెట్టులా నా జన్మను

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా...  రక్త బంధం విలువ నీకు తెలియదురా

ఆడ జన్మలొ  ఉన్న అర్ధాన్ని వెదికాను ... అమ్మా అని పిలుపుకై అల్లాడి పోయాను
చిన నోట తొలిసారి అమ్మ అని పలికితే ... ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను
పురిటి నొప్పుల బాధ   ఈశ్వరా ... నీ పార్వతిని అడగరా శంకరా
తల్లిగా పార్వతికి ఒక నీతినా ...   తల్లి గుండెల్లోన చితిమంటనా

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా...  రక్త బంధం విలువ నీకు తెలియదురా

4 కామెంట్‌లు:

Bottom Ad [Post Page]