Rest In Peace నిసార్ గారు
మీకు పాటాభివందనం🙏
తెలంగాణా పాటను సారవంతం చేసిన కళాకారుడు నిసార్. ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసిన నిసార్ తన పాటల ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేసిండు. నల్లగొండ జిల్ల్లా ఉద్యమచైతన్యాన్ని ఆవాహన చేసుకొన్నవాడు. పేద ముస్లిం కుటుంబం లో పుట్టిన నిసార్ అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువు నిచ్చాడు. ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణా జానపద సాంస్కృతిక రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు. పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయే అనే పాట తెలంగాణా ధూం ధాం సభలలో పెద్ద ఆకర్షణ. ప్రజానాట్యమండలి పతాకమైన వాడు. తెలంగాణా ఉద్యమ జ్వాలా గీతమైన వాడు నిసార్. ఆయనకు మల్ల్లా వఝల సదాశివుడు పురస్కారం అందించాము. టి న్యూస్ మాటా ముచ్చట నిసార్ సాంస్కృఇతిక చైతన్యాన్ని రికార్డు చేసింది.నిసార్ కు కన్నీటి నివాళి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి--- దేశపతి శ్రీనివాస్
మన నిసార్ గారి గురించి చిన్న వ్యాసం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి