Full width home advertisement

Post Page Advertisement [Top]

మన బాల్యం పాట || Veeri Veeri Gummadi Pandu




వీరి వీరి గుమ్మడి పండు వీరీపేరేమి
దాగుడుమూతలు దండాకోర్ వీరి పేరేమి
కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కే టందుకో (2)
అల్లం దుర్గాం ఇల్లమ్ దుర్గం ఆడిన ఆటలు మదిలో పదిలంలే
నా మదిలో పదిలంలే                                    (వీరి వీరి గుమ్మడి)

మెత్తని ఇసుకల దొప్పుడూపుల్లను దాసిన సంగతి గురుతుందా
నలుగురు కలిసి నాలుగు రాళ్ళను ఆడిన ఆటే గురుతుందా
చిన్నతనమంటే కొంటేతనమేలే ఎన్నిఎల్లైనా తీయని జ్ఞాపకమే
ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే
మన బాల్యం అద్భుతమే                                 (వీరి వీరి గుమ్మడీ)

పంటలు పంచి దొంగని ఎంచి రేసాటాడితిమందరమే
రేగాడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే కటితిమే
గద్దే వస్తుంది కోడిపిల్లేది
దస్థి బిస్థాడి సెల్లాలసితిరి
సెల్లాల బండి మా ఊరు బండి ఎక్కంగా రారండి
మీరంతా రారండి                                              (వీరి వీరి గుమ్మడి)

ఉప్పుబేరలు వూరి నడుమున ఉల్లాసంగా ఆడినమే
తుంటార అంటూ గాడిద అంటూ చిర్రగొనెతొ చిందులులె
ఎడుగురు ఒకటయ్యి చెడుగుడు ఆడినాము
జాజీరి ఆటల్లో పాటలు నేర్చినాము
జ్ఞానం నేర్పిన ఆటలు నాడే పల్లెలో ఆడినమే
మా వూరిలో ఆడినమే                                       (వీరి వీరి గుమ్మడి)

ఆ ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతుంది
హండ్రైడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతుంది
మోపేడు బరువయ్యే ఆంగ్లం సదువుల్లో
బస్సెక్కి బంధీగ మారెను బాల్యంలో
మా ఊరిబడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చినమే
మా తరమే అద్భుతమే                                       ( వీరి వీరి గుమ్మడి)


రచన, గానం, దర్శకత్వం, నిర్మాణం.
మానుకోట ప్రసాద్ 


1 కామెంట్‌:

Bottom Ad [Post Page]