Full width home advertisement

Post Page Advertisement [Top]

 పుట్టిన గడ్డను మరువకు



గుంపులు గుంపులుగా తిరిగితే చాలదు ... గుండెలో గడ్డ మీద ప్రేమ ఉండాలె! జెండా ఎగరేస్తే పండుగ అయిపోదు... జీవితమంతా ఈ మట్టి వాసన మరువకుండాలె!


పోరాడి తెచ్చుకున్నం అని సంబర పడితే సరిపోదు, సొంత యాస మాట్లాడనికి సిగ్గు పడితే ఎట్ల? పరాయి మోజులల్ల పడి, తల్లి పాలు మరిచిపోతే... నువ్వు మనిషివా? లేక మత్తులో ఉన్న పశువా?


తెలంగాణ అంటే మ్యాప్ మీద గీత కాదు, అది మన ఆత్మ గౌరవాలు దాచుకున్న కథ! నీళ్ళు, నిధులు, నియామకాలు అని అరిచినం... ఇప్పుడు "నా తెలంగాణ" అని ప్రేమించనికి వెనకాడుతున్నం?


ఏది నీ సొంతం? ఈ నేలను ప్రేమించలేని బ్రతుకు ఎందుకు? పుట్టి పెరిగిన ఊరు మీద ధ్యాస లేనోడు... బ్రతికి ఉండి కూడా, శవంతో సమానం!


లే! మేలుకో! భూమి పుట్టినంక, దానిని ప్రేమించక పోతే... ఆ పుట్టుకే దండగ! ఇది నా గడ్డ... ఇది నా బిడ్డ... అని గర్వంగా చెప్పు!


కాళోజీ నారాయణ రావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]