Full width home advertisement

Post Page Advertisement [Top]

లంకలోని సీతలా రామునికోసమే 

  లంకలోని సీత ల రామునికోసమే
రంధి పట్టుకున్నావా చిన్ని జాబిలమ్మ

రాజ్యమే లేని ఈ పేదోని ఇంటికే
రాణి వే అవ్వాలన్న ఆశే ఎలనమ్మ 
 
వారధిని కట్టలేను
వాలిని కొట్టలేను
వాయు పుత్రుడు లేని వంటరి పక్షినేనమ్మా. 
 
విల్లు ఎక్కు పట్టలేను
వీరుడల్లె పోరాడలేను
పూరి గుడిసెలో వుండే ఓ పేదోని నమ్మ ,,,,

సీత ప్రేమ వారధి చేసి ఆ లంక లో కి నే చేరుకుంటా
రాత రాసె దేవుడి మీద ఒట్టు నిన్ను కాపాడుకుంటా,,,    |2|

అంతురాల బంగుల లేదు 
ఆయమన్న అంగే లేదు
ఆకలైతే మూడు పూటలా తిండి పెట్టలేని పేదోడినమ్మ.

చీకటి ది వెలుగే లీదు
సూడ పోతే సోటే లీదు
చినికి పడితే నిలువ నీడ లేని ఒంటరి పక్షిని అమ్మ. 
 
రెక్కల కష్టం తోనే బతికే బాట సారి నమ్మ,,,
చమట చుక్కలతోనే కలం సాగె కూలి నమ్మ,,,  |2|

సీత ప్రేమ వారధి చేసి ఆ లంకలోకి నే చేరుకుంటా
రాత రాసె దేవుని మీద ఒట్టు నిన్ను నే కాపాడుకుంటా |2|

కన్నీరే కళ్ళళ్ళ దాసి కట్టమే రాకుండా చూసి
నవ్వులే కనుక చేసి ఇత్తనే వెన్నల అమ్మ. ,,,

బాదే నే గుండెల్లి దాసి
మనసులో నిన్నే తలచి   
కంటికే రేప్పొలే నిన్ను కాపాడుకుంటా నీ కోయిలమ్మ. ,,,,
యంత దూరమా ఐన నీకోసం వస్తనే నే జాబిలమ్మ.
పానం అయినా నీకు ఇమన్నా ఇస్తానే వెన్నెలమ్మ.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]