తెలంగాణ అంటే ఎంతసేపూ డించక డెంచక పాటలే అనుకుట్టుర్రా , మా మనసులు సుతి మెత్తనియి మా పాటలు గూడ అట్లనే ఉంటై, కావాలంటే ఈ పాట ఇనుర్రి.
ఒడ్డడ్డు గడ్డి గోసి ఒడ్డు కింద వెట్టి
ఒడ్డడ్డు గడ్డి గోసి ఒడ్డు కింద వెట్టి
ఒడ్డడ్డు గడ్డి గోసి ఒడ్డు కింద వెట్టి
ఒడ్డు నీడల దిరిగే వసుదేవుడేడె? యేల రాడే నీల వరుడు ??
అమ్మ ఏ నిజమాయె నేమో!! యేల రాడే నీల వరుడు?
కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మకింద వోసి
కొమ్మ నీడల దిరిగే కోమారుడేడే? యేల రాడే నీల వరుడు??
అమ్మ ఏ నిజమాయె నేమో!! యేల రాడే నీల వరుడు?
మాను మాను పూలేరి మానుకింద వోసి
మాను మాను పూలేరి మానుకింద వోసి
మాను నీడల దిరిగే మాదేవుడేడే? యేల రాడే నీల వరుడు??
పాల దుత్తలు గలిగే పైమంద గలిగే పాల మందలు గలిగే
పక్కల నాకోక శంకరుడు గలిగే. యేల రాడే నీల వరుడు??
అమ్మ ఏ నిజమాయె నేమో!! యేల రాడే నీల వరుడు?
ఎట్లుంది , సూపర్ లే .. మరి ఇంకేంది అందరికి పంపూర్రి జల్దిన.
ఎట్లుంది , సూపర్ లే .. మరి ఇంకేంది అందరికి పంపూర్రి జల్దిన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి