Full width home advertisement

Post Page Advertisement [Top]

ఇనక వోతివి కదరా 





ఇనక వోతివి కదరా
ఇనక వోతివి కదరా ఎరుక గలిగిన పదము
కొరివి కోని దెచ్చుకొని వనికితేమి ఫలము
దయ్యమోలే నిన్ను పట్టుకున్నది ధనము
యుగములు గడిసిన మారలేదు నీ గునము

నాకేదురె  లేదని నాకేదురే లేదని
నాకేదురే లేదని ఎగిసిపడే నీ మదము భరియింపక పుడమి శపియించెను ఇది నిజం

ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా
ఏ ఏ  ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా

దూరాన గల సిరులా దారులను గాలించి
పడవా లిమానాల పయనించి అవి తుంచి
కొమ్మ కుంకుమ పూల అడవి సుగంధాల
పాదులను చిదిమి నరికి పారించితివీ  మురికి
ఆ పాపమో మున్ను అంటుకునే విష కన్ను ఆ పాపమో మున్ను అంటుకునే విష కన్ను
ఏమౌనో నీ కత ఎందాకో ఈ వ్యత

ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా
ఏ ఏ  ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా

నేల యద చనుబాల ధారలు ఈ నదుల కీచకుడై నువ్వు కాటూ వెయ్యలేద
చెట్టుకింతా జాగ పిట్ట కింత గూడు పురుగు బూసికి పుట్ట బొరియలుంటే చాలు
నరుడా నీవెమో వందల ఎకరాలె  పొంది
చీమైనా రాకుండా గోడలు గట్టించినావు
ఏడడుగుల జాగ అ ఆ
ఏడడుగుల జాగ చివరికి నీ గూడన్న
బైరాగి బోదను పెడ చెవిన పెడితివన్నా

ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా
ఓ  ఓ   ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా

సలువా రాతి మేడ కట్టుకుని మురిసితివి
కడు పేదలను ఎంచి మెట్ల కడ నిలిపితివి
రంగు తెగ మత కుల బేదాలనెంచితివి
ఇలలో ఉత్తముడనని తెగ విర్రవీగితివి

తొమ్మిదర్రల తొర్రా
తొమ్మిదర్రల తొర్ర గాలి తుంగ బుర్ర
తొమ్మిదర్రలా తొర్ర  గాలి తుంగ బుర్ర
కొరడ క్రీమీ వేటుకు ఓరిగెను నీ వెనుగర్ర

ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా
ఏ ఏ  ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా

తేనేలొలికే పండ్లు ఆకు సాటుననుండు
వాడి గలిగిన ముండ్లు పైనే ఉరుముచునుండు
స్వాతి ముత్యపు సెమట వొల్లు ముత్యపు జల్లు 
భరణి ఉరుములు డొల్లు కాపు కంకుల పొల్లు
ఆశలేని మనిషికి అడివే తన ఇల్లు
ఆశలేని మనిషికి అడివే తన ఇల్లు
సిరి మరిగిన నీకేమో నెత్తి కెక్కినాయి కళ్లు

ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరాఎరుక గలిగిన పదము కొరివి కోని తెచ్చుకొని వనికితేమి ఫలము

ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా

ఎగువా తిరుమల దిగువా తిరుమల
నీలోనే కొలువుండే నిలకడతో నీవుండు
కనుపాపలో మక్కా అజ్మీరులున్నవీ
జమయాత్ లేందుకు జపములు జాలు
ఏ ఏ ఘాటి ఎద్దువోలే మతిని గుంజి  కట్టు ఓ ఓ ఓ ఓ
ఘాటి ఎద్దువోలే మతిని గుంజి కట్టు
కాసే పున్నమి కాంతి నీలోపలనే పుట్టు

ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా
ఏ ఏ  ఇనక వోతివి కదరా  ఇనక బోతివి కదరా

పాట పేరు : ఇనక వోతివి కదరా 
సాహిత్యం : గోరటి వెంకన్న 
 సంగీతం : రామ్ మిర్యాల & యశ్వంత్ నాగ్ 
పాడినవారు : రామ్ మిర్యాల 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Bottom Ad [Post Page]