మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో

  కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
  నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
  కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
  నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...

  పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే  ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు...
  వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో.....
  నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ.....             // కంచరేగి తీపి//

  మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును...
  వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో.....
  నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ.....        // కంచరేగి తీపి//

  కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు  ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన...
   పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో.....
  పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ.....        // కంచరేగి తీపి//

  ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో  దుసరిపొదల పాన్పుపైన...
  అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో.....
  ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//

  నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి...
  దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో.....
  నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ.....           // కంచరేగి తీపి//

  ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి  పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు...
  నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో.....
  ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ......          // కంచరేగి తీపి//
 • You might also like