మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • Telangana Govt respects our Poets and Singers

  Telangana Government respects our Poets and Singers   తెలంగాణ కవులు, కళాకారులకు సముచిత గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి అనే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలను అట్టడుగు స్థాయి వరకు గ్రామగ్రామానికి చేరవేసేలా ఈ పథకం ఉపయోగపడుతుందని కేసీఆర్ వివరించారు. ప్రముఖ కవులు డాక్టర్ నందిని సిద్దారెడ్డి, గోరేటి వెంకన్న, జయరాజ్, మిట్టపల్లి సురేందర్, యశ్‌పాల్, దేశపతి శ్రీనివాస్, వరంగల్ శ్రీనివాస్, మార్త రవి తదితరులతో కలిసి ఇవాళ కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకాలంలో వందలాది మంది కవులు, కళాకారులు వనరులు ఉన్నా లేకపోయినా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని గుర్తు చేశారు. వారందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

  దాదాపు 500 మంది కళాకారులకు ఉద్యోగావకాశం కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు. ఇందు కోసం అవసరమైతే నిబంధనలను సడలించే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళా బృందాలుగా పనిచేసిన వేలాది మందికి సముచిత పారితోషికం ఇచ్చి గౌరవించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. 

  Source: Namaste Telangana 9/30/2014 8:35:44 PM


 • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి