Full width home advertisement

Post Page Advertisement [Top]

kaviఅంతడ్పుల నాగరాజు గురించి అందరికీ అంత బాగా తెలుసో లేదో. కానీ, రసమయి మాత్రం తెలుసు. ఒక్కరు కాదు, ఇద్దరూ తెలియాల్సిన సమయం ఇది. ఒక రకంగా ధూం దాంలో ధూం రసమయి అయితే దాం అంతడ్పుల అనాలి. అవును మరి. మలిదశ సాంస్కతికోద్యమంలో అంతెత్తున లేచిన ధూందాం అన్నది వీరిద్దరి కషి ఫలితం. అందులో రసమయిది పాట అయితే అంతడ్పులది ఆట. రూపకం. నత్య రూపకం. దర్శకత్వం.


నిజానికి ధూం దాం ఆవిర్భావానికి ముందే 2001లో జానపద జాతర పేరిట అంతడ్పుల జరుపుతున్న కళాబందమే ఉద్యమ సమయంలో ధూం దాంగా విస్తరించింది. ఈ మాట చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది గానీ ఇది వాస్తవం. అందుకు రసమయి డిస్కవరీ ముఖ్యం అయితే కేసీఆర్ విజనరీ ప్రధానం. కానీ మాతక మాత్రం అంతడ్పులది అంటే అతిశయోక్తిగా ఇయ్యాళ వినవస్తది గానీ అది నిజం. అందుకే ధూందాంకు భూమిక వహించిన అంతడ్పుల రూపకల్పనా కౌశలాన్ని, దర్శకత్వ ప్రతిభను, అట్లే తన పిల్లల కషిని ఇయ్యాళ గుర్తు పెట్టుకోవలసి ఉంది. ఈ తల్లికోడిది, అతడి పిల్లల కషి మామూలుది గాదు, మందమర్రి నుంచి మొదలై వీళ్లు పల్లెపల్లెలోనూ ధూం దాం చేసిండ్రు. కనీసం పదమూడు సార్లు ఈ బందం సభ్యులు యాక్సెడెంట్ల నుంచి ప్రాణాలతో బయటపడ్డరు. అవును మరి. వారి కషి కేవలం ఆటపాటలతోనే ముడివడి లేదు. ప్రయాణాలకు, వ్యయప్రయాసలతోనూ కూడుకున్నది. ఈ కారణంగానే ఉద్యమం కన్నా కవి సమయానికి, అందులో తన బందం నెరిపిన కవితా న్యాయానికి అభినందనలు చెప్పుకోవలసీ ఉంది. ఆ బందాన్ని సష్టించిన ఈ సజనశీలిని మెచ్చుకోవలసీ ఉన్నది. ఇదొక సంబురం.

తనది చిన్న వయసే. 34 ఏండ్లే. అట్టడుగు కులంలో పుట్టిన శ్రామికుడు. తండ్రి దుర్గయ్య. సింగరేణి ఎంప్లాయి, సిపిఐ కార్యకర్త. ప్రజానాట్యమండలి ఒరవడిలో ప్రజల చెంతకు వెళ్లడం అన్నది అంతడ్పుల నాగరాజుకు వచ్చిందీ అంటే, జానపదాన్ని సామాజికం చేయాలన్న తలంపు ఒకటి తనలో ఉన్నదీ అంటే - అది తండ్రి వారసత్వం. ఇప్పుడాయన లేడు. తల్లి ఓదవ్వ ఉన్నది. ఆమె అచ్చమైన జానపదురాలు. కొడుకు ఈ మధ్య చెల్లెండ్లను తీసుకుని కొండగట్టుకు వెళితే, ప్రత్యేకంగా దర్శనం చేయిస్తే, గర్భగుడి దాకా తీసుకెళితే అది తన వ్యక్తిగత పలుకుబడి వల్ల అని తెల్సుకోలేదు. వ్యవస్థే మారిందనుకుందట. కొడుకు ప్రయోజకుడు అయ్యిండని కాకుండా వ్యవస్థే మారి ఇట్లే అందరికీ ప్రత్యేక దర్శన బాగ్యం కలగుతున్నదేమో అని మురిసిపోయిందట. అంతెందుకు? రసమయికి దొరికి, తన కొడుక్కి అసెంబ్లీ టికెట్కు దొరక్కపోతే కొడుకు యాల్ల పొద్దుగాల లేచి క్యూలో నిలబడలేదేమో అనుకుందిట. టిక్కెట్టు అంటే సినిమా టిక్కెట్టే అనుకునేంత అమాయకురాలు మరి!

ఇక్కడ రెండు విషయాలు. సుమారు రెండు దశాబ్దాలుగా ప్రోగ్రాంల కారణంగా రాత్రి రెండు తర్వాతే నిద్ర. ఉదయం అన్నది లేదు. చూసే పరిస్థితి లేదు. ఆ సంగతి సూచ్యంగా పలుకుతూ అన్నదో లేక నిజంగానే అమాయకంగా అన్నదో గానీ తనకు నిజంగానే టిక్కెట్టు అంటే సినిమా టిక్కెట్టు వంటిదే అని అనుకునేటంతటి అమాయకపు అవ్వ ఓదెవ్వ. అసొంటి తల్లి కడుపుల పుట్టిన అంతడ్పుల నాగరాజు ధూం దాం నిర్వహిస్తుంటే అదొక తెలిసీ తెలియని సంబురం. అర్థం కాని ఆనందం. తల్లికీ అంతే. తండ్రి ఉన్నప్పుడు గూడ అంతె. తన వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యోగాన్ని కొడుకు తీసుకోలేదు. అటు ఉద్యోగాన్ని వదిలేసి, ఇటు ఇల్లూ వదిలేసి భుజానికి బ్యాగేసుకుని వెళ్లిపోయిన కొడుకు ధూం దాం పేరిట మళ్లీ ఊర్లెకి వచ్చిండంటే వెళ్లి కలిసేది. జనంలో తండ్రీ కొడుకులు చేతులు కలుపుకుని విడిపోతారు. మళ్లీ అంతడ్పుల ధూం దాం. అట్లా ఇంటికి కాకుండా తెలంగాణకే అయిన మలిదశ తరంలో అంతడ్పులది ఒక చెప్పతరం కాని యాతన. తెలిసీ తెలియని యాతన. సంబురం. కళారూపం.

ఒక రకంగా అడుక్కు తింటున్న కళారూపాలని ఆయన వేదిక మీదికి ఎక్కించిండు. ఇది యాతనా, సంబురం. అట్లా మలిదశ తెలంగాణపైకి తాను తొలినాళ్లలో తెచ్చిన జానపద జాతరలో ఒకటెన్క ఒకటి కళారూపాలన్నీ వేదిక మీదికి వస్తయి. బొడ్రాయి, బతుకమ్మ, పీరీలు, హరిదాసులు, పాములోళ్లు. ఇంకా తీరొక్క కళా జీవితాలన్నీ కూడుతయి అక్కడ. అక్కడ జానపద సేకరణ పాటొకటి మొదలైతుంది. ఇక అన్నీ వచ్చిపోతుంటయి. కళ్లకు గంతలు విప్పితే ఒక్కసారి పట్నవాసి కళ్ల ముందు గ్రామం కనబడ్డట్టు మొత్తం తాను రూపొందించిన వేదిక మీద ఇవన్నీ కానవస్తయి. ఆట్లా పాటై ప్రాణం పోసుకుని ఒక్క పరి మన జీవితాల్లోని ఆధునికతను ఆ ఘడియల్లో పిప్పి చేస్తయి. ఇట్లా అంతడ్పుల ఒక అద్భుత రూపకానికి కల్పన చేసిండు. వేర్వేరు కళారూపాలు సంక్షిప్తంగా ఒకదానికొకటి సమన్వయంతో ఒకే కాన్వాసు మీద తానొక విస్తారమైన జీవితాన్ని పరిచినట్టు పరుస్తడు. అండ్ల గౌండ్లాయన కల్లు వంచుతడు.

అదొక సంబురం. ఇట్లా ఆటను పాటను జతచేసి మన సాంస్కతిక ఐడెంటిటిటీనీ గుర్తు చేసి జీవితాన్ని కళాత్మకం చేసి వదిలిపెడతడు. ఆ పనే ఇయ్యాళ తెలంగాణ సాంస్కతిక పునరుజ్జీవనానికి అందివచ్చిన వేదికైంది.
చిత్రమేమిటంటే తన రూపకల్పనలో ఉన్నది నటన కాదు, అభినయం కాదు. జీవితం. అదే ఈ నత్య దర్శకుడిని తెలంగాణ జీవ దర్శకుడిగా నిలబెడుతున్నది. ఇదే సిసలైన కవి సమయం. ఎట్లంటే ఒక పిట్టలదొరను తన వేదిక మీద చూసి అచ్చం పిట్టలదొర లెక్కనే ఉన్నడనుకుంటం. కానీ తాను పిట్టలదొరనే వేదిక ఎక్కిస్తడు. పాములోళ్లను ఎక్కిస్తడు. కోడిని, ల్యాగదూడను, మేకపోతునూ ఎక్కిస్తడు. తాటిచెట్టుకు నిజంగనే లొట్టిగట్టి నిలబెడ్తడు. అదీ తన ఘనత.

ఇట్లా మనల్ని మళ్లీ నిలబెడతడు. బిచ్చగాళ్లుగా రోడ్లమీద తిరగాడుతున్న మన బహురూప కళామూర్తులను ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమం పుణ్యాన వేదికమీదికి తెచ్చి కవితా గౌరవం తెచ్చిండు. బొడ్రాయిని పొందించినట్లు ఆత్మగౌరవాన్ని పొందింపజేసిండు. ఇదీ తన ఒరవడి. ఆయా కళాకారులు సభాస్థలికి చేరుకునే సమయంలో వాళ్లను ఆల్రెడీ డ్రెస్‌తో పంపి సమయాన్ని మిగుల్చుకుంటడు. అట్లా బోనాలు, బతుకమ్మలతో తన బందం కదలడమే ఒక ఊరేగింపై కళారూపం అయింది. ఇదంతా తెలిసీ తెలియక జరిగిన ఉద్యమం.

దానికి ఈ అమాయక చక్రవర్తి అధినేత, దర్శకుడు అని అనడం కూడా గర్వకారణమే. ఎందుకంటే ఇది మన లక్షణం. ఇంకా ఉన్న లక్షణం. ఇదీ పదవ తరగతి నాలుగు సార్లు ఫెయిల్ అయిన ఈ యువకుడి జీవన శైలి. తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో చదువుతూ, తాను నిమగ్నమైన వేదికపైనే తాను పి.హెచ్‌డి చేస్తున్నడు. నిజం. ధూం దాం కళారూపాలపై పరిశోధన గావిస్తున్నడు. అదీ మలుపు అంటే.

ధూం దాంలో తనవి మూడు ముఖ్య రూపకాలు. ఒకటి, తానడిల్ల తల్లడిల్ల ఏలో...మన పల్లెల్లోనా. రెండోది, హొయ్యారే హొయ్యా హొయ్యా... హొయ్యారే హొయ్యా హొయ్యా ...అంటూ...పిల్లలంతా చేరి, సూడసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి రూపకం. మూడోది గోరటి వెంకన్న సంత . ఇట్లా పల్లెల్లోని ఒకనాటి కుల వత్తుల వైభవం, మనవైన పండుగల సంబురం, మన దేశీయ జీవనశైలిని చాటే సంతలు, వీటన్నటినీ చెబుతూనే ముఖ్యంగా గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో పాడుతూ, కనిపించని కుట్రల ఇవన్నీ ఎట్ల మాయమైనయో వివరించడం.

దాంతో ఒక జోష్ అదే సమయంలో యోచన. రెండూ కలిగించడం అంతడ్పుల శైలి. తాను ఇటీవల నందిని సిధారెడ్డి అమరులపై రాసిన జోహార్లు పాటకు కూడా రూపకం రూపొందించిండు. ఈ మూన్నాలుగు పాటలకు తాను కల్పించిన దశ్య రూపకం నిజంగానే అపూర్వం. అవి ధూం దాం ప్రదర్శనకు హాజరైన ప్రేక్షకులను పూర్తిగా వశ పర్చుకున్నై. మలిదశ ఉద్యమలో అవశ్యమైన సందేశాన్ని వాళ్లకు సావధానంగా అర్థం చేయించినై.

అయితే, తాను ఇప్పటి కవిగాయకుల పాటలెన్నింటికో దశ్యరూపకం (స్టేజ్) చేసి వాటిని షూట్ చేయడమూ ఒక ముఖ్య అంశం. వీడియో సీడీల్లోనూ అనేక పాటలున్నై. అందులో జయరాజ్ వానమ్మ వాన పాటకు తన రూపకల్పన చూస్తే కవి హదయానికి దశ్య రూపం ఇవ్వడంలో ఇతడిలోని కవితాభివ్యక్తి ఆయా స్థలకాలాల్లో పరిమితమైన వనరుల్లో ఎలా హద్యంగా రూపొందాయో తెలుస్తుంది. ఒక రకంగా కవి ఊహకు కొనసాగింపుగా వానమ్మ వాన పాటలో...కప్పతల్లి ఉత్సవాన్ని జోడించి ఒక తల్లి బిందెడు నీళ్లు కుమ్మరించడంతో పాటను కల్పన చేస్తడు.

దీంతో పాట మరింత అస్తిత్వంతో సాంస్కతిక ధారతో మొదలౌతుంది. అట్లే నాగేటి సాళ్లలో నా తెలంగాణ అన్న సిధారెడ్డి పాటలో తాను గాయకుడు దేశపతి వెనకాల నలుగురిని, ముందు నలుగురినీ వుంచి మడికట్ల మీద వాళ్లు చిన్నగా కదులుతూ ఉంటే పాటను శతిలయలతో మరింత రాగయుక్తం చేస్తడు. దశ్యమాధ్యమంలో సరాగాలు ఒలికిస్తడు. ఇట్లా తన నత్య దర్శకత్వంలో ఒక కవి సమయాన్ని అర్థం చేసుకోవడం, కొనసాగించడం, మరిన్ని దేశీయ ప్రతీకలతో నత్యభరితం చేయడం కానవచ్చి మొత్తంగా మలితెలంగాణ దశ ఉద్యమ తరుణంలో ఎంతోమంది కవి గాయకులకు కట్, యాక్షన్ చెప్పిన ఖ్యాతి మూటగట్టుకున్నడు.

ఆహ్లాదమైన అనుభవాన్ని అందజేసిండు. టెలివిజన్ కార్యక్రమాలకూ నత్యదర్శకత్వం చేయడమూ తన ప్రత్యేకత. టీవీ 5లో వచ్చే విమలక్క పోగ్రాంకూ తాను పనిచేస్తున్నడు. ఒక చానల్‌కు క్రియెటివ్ హెడ్‌గా బాధ్యతలు చూస్తున్నడు. ఇక ధూం దాం సీడీలు తమకంటే ముందే దేశవిదేశాల్లోకి వెళ్లడం వెనుక ఉన్నదీ ఈ దర్శకత్వ ప్రతిభే.
స్వయంగా తాను పాటలు రాయనప్పటికీ ఒకనాడు తాను గరీబు పేరుతో కవిత్వం రాసిండు. దశ్యమాధ్యమాల విషయానికి వస్తే తాను చిన్నప్పటినుంచి మంచి ఫొటోగ్రాఫర్. వీడియోగ్రాఫర్ కూడా. ఎడిటింగ్, మిక్సింగ్‌లపై పూర్తి పట్టు ఉంది.

ఇక స్వయంగా డ్యాన్స్ మాస్టర్, ఫోక్ మాస్టర్. ఇవన్నీ కలవడం వల్లే ధూం దాం వేదిక గానీ, అంతకుముందరి జానపద జాతరల సెట్ల రూపకల్పన, నత్య రూపకాల సంక్షిప్తత గానీ పరిణితి పొందింది. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సాగింది. ఉద్యమ సమయంలో కార్యకర్తలను ఉత్తేజ పరిచింది. అయితే, ఇదంతా ఒక క్రమ పరిణామంగానే చూడాలి. ఇట్లా ఈ తరం సష్టికర్తగా అంతడ్పుల నాగరాజు పాత్ర మహత్తరమైంది.

తన కాంట్రిబ్యూషన్లో ఒకటి ముఖ్యం. అదేమిటంటే, తాను రూపొందించిన రూపకాల కోసమే తాను వేదికను నిర్మించిండు. ఆ వేదిక అన్నది పూర్తిగా కళాకారులకు చెందవలసిందే అన్నది నాటినుంచి తన పుట్టుదల. కేవలం ఈ వేదికే తమకు నిండైన పాత్రలనిస్తయి అంటడు. వేదిక దిగితే తాము మందలో కలిసిపోవడమే. అందుకే ఉద్యమ సమయంలో ధూం దాంలో ఎన్నడూ వేదికపైకి రాజకీయ నేతలు సైతం రాకుండా చూసుకున్నడు. తన పట్టుదలే తర్వాత రసమయి నిలబెట్టడం గొప్ప విషయం. ఆ కారణంగా ధూం దాం అన్నది ఒక స్వతంత్ర కళాకారుల వేదికగా మారింది.

ఇది అంతకుముందు తాను కళా జాతరలో అనుసరించిన విధానమే. దానికి ఎక్స్‌టెన్సన్ ఏమిటంటే, అంతదాకా తాను రూపొందించిన జాతరలో జానపదం ఒక్కటే ఉండేది. అది తన విశిష్టత అయితే రసమయి దాన్ని వివిధ ఉద్యమ పాటలతో, పాటగాళ్లతో, కవి గాయకులతో మిళితం చేసి జానపద జాతరకు ఉద్యమ విస్తతిని కల్పించిండు. దాంతో అది ధూం దాంగా పేలి తెలంగాణను తేవడంలో కీలకం అయింది.

నిజానికి చిన్ననాడే కళతో తన జీవితం ముడివడింది. ఒకనాడు తాను బ్రేక్ డ్యాన్సర్. బ్లాక్‌బెల్ట్ హోల్డర్. చిరంజీవి ఫ్యాన్. ఐయామె డిస్కో డ్యాన్సర్ పాటకు అద్భుతంగా ఆడేవాడు. అటు తర్వాత సింగరేణి ప్రాంతంలో ముఖ్యంగా మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతంలో డ్యాన్స్ మాస్టర్ అయ్యిండు. వినాయక చవితి నవరాత్రులు మొదలు అక్షరజ్యోతి దాకా. ఏ పని దొరికినా ఆటా పాటా నిర్వహణ. అటెన్క మునీర్ వంటి జర్నలిస్టుల ప్రోద్భలంతో తాను సామాజికం అయిండు. డిస్కో స్థానంలో ఫోక్‌ను పట్టించుకున్నడు. సామాజిక స్పహతో కూడిన జానపద కళా బందాన్ని స్థాపించిండు. స్వరమాధురి కళా నిలయం పేరిట వందలాది షోలు ఏర్పాటు చేసిండు. ఆపన్నహస్తంగా ఉండేవాడు.

సమూహంగా కదిలేవాడు. చిన్నచిన్నవాళ్లను చేరదీసే వాడు. అంతా కళ చుట్టూ పనే. ఆ క్రమంలో వ్యక్తులు, సంస్థలకోసం ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు. విరాళాలు సేకరించి ఇచ్చేవాడు. పాదయాత్రలు చేసేవాడు. అంతా చిన్నతనం. తెలిసీ తెలియక చేయడమే అంటడు. అట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోవడమే తెలుసు అనీ అంటడు. ఇప్పటికీ అదే ఒరవడి. అయితే తాను జానపద జాతర పేరిట నిర్వహించిన సభలతో తాను మలుపు తిరిగిండు. ఒక సభకు రసమయి బాలకిషన్ రావడం. చూసి ఆశ్చర్యపోవడంతో తాను విశాలమైన సమాజానికి పరిచయమైండు.

నిజానికి జానపద జాతర పేరిట అంతడ్పుల జరుపుతున్న కళా బందమే ఉద్యమ సమయంలో ధూం దాంగా విస్తరించింది. రసమయి శ్రీరాంపూర్‌లో అంతడ్పుల బందం ప్రదర్శన చూడటం, అటువంటి ప్రదర్శనే తాను రూపొందించిన ఒక సీడీ విడుదల- అప్పుడు రవీంద్రభారతిలో ప్రదర్శింపమని కోరడం. దానికి కేసీఆర్ రావడం. చూసి అంతడ్పులతో ఒక సాంస్కతిక ఉద్యమ అవసరాన్ని నొక్కి చెప్పడం, ఇలాంటి ప్రదర్శనలు యావత్ తెలంగాణ అంతటా ఏర్పాటు చేయాలని కోరడం, రసమయి పాట, అంతడ్పుల ఆటా జతకూడటం. అలా రూపకల్పన జరిగిందే ధూం దాం. నిజానికి ఇదే తన కవి సమయం. అంతదాకా తాను విస్తరించాలని చూస్తున్నడు. కానీ తెలియదు. అటువంటిది తనకు కాలం తెలియజేసింది తన పాత్ర మహత్తరమైందని. తనలో ఇదొక సష్టి.

అటు తర్వాత రసమయి వేదిక అయిండు. అంతడ్పుల ప్రదర్శన అయ్యిండు. అదొక చరిత్ర అయింది. ఇంకా రాయలేదుగానీ అది నిజంగానే ఒక చరిత్ర. ఇందులోకి ఒకరొకరుగా చేరుకుని కవులు, గాయకులతో విస్తరించడమూ జరిగింది. ఇది ఇంకొక చరిత్ర. పోవడం, విభేదాలు రావడం, మళ్లీ కలవడం ఇదీ చరిత్రలో భాగమే. అయితే, ఎంతమంది కవి గాయకులు వచ్చిపోయినా రసమయి వ్యాఖ్యానం, పాట తప్పనిసరి అయింది. అది మాత్రం నిలబడ్డ చరిత్ర. ఇందులో ఇద్దరిదీ అద్వితీయ పాత్ర. సమం. నాగరాజుకి అభినందనలు. అతడి బందానికి వందనాలు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]