కాకతీయ, రెడ్డి రాజుల పౌరుషాల గడ్డ, నిజామోడి ముద్దుల బిడ్డ నా తెలంగాణా. ఆదరిస్తే అన్నం పెడ్తది, మంచిగ మాట్లాడితే కడుపుల పెట్టి సూసుకుటది, అధికారాన్ని గౌరవిస్తది తెలంగాణా ప్రజ, అమయాయకంగా ఉంది కదా అని ఆదిపత్యం చెలాఇంచాలని సూశినవా తొక్కి బొంద పెడతది. అలా ఎంతో మంది రాజుల పాలనను బరించి తనకంటూ ఒక అస్థిత్వాన్ని ఏర్పరచుకుంది. ఆనాడు నిజామోడు రెచ్చిపోఇనా ఈనాడు మన పాలోడు విర్రవీగినా తన సత్తా ఏందో సూపించినది. ఇది ఎవరో ఒకరి గొప్పతనం కాదు యావత్ తెలంగాణా ప్రజ గొప్పతనం.
తెలంగాణ అంటే నే జానపద పాట, జానపదం అంటే నే తెలంగాణ ప్రజ
జానపదం అంటే జనాల పాట, శ్రమ జీవుల పాట, తెలంగాణ ల ఉన్న ప్రజలు అమాయకత్వానికి,శ్రమకు మారు పేరు, అటువంటి ప్రజల నోటివెంట జాలువారే ప్రతి మాట ఒక పాటే, ఇక్కడ మట్టి పాడ్తది, పిట్ట పాడ్తది, పనికి బయపడని ఎద్దు పాడ్తది, ఎడ్లను తోలే యాదిగాడు పాడ్తడు. అలాంటి మట్టి మనుసుల నిలయం తెలంగాణాల ప్రతీ పాటా ఒక ప్రాణమే.
మనిషి కష్టాన్ని మరువనీకి పాట గొప్ప మందు, బాధను దిగమింగ నీకి ఒక బందు, ప్రేమను చెప్పనీకి ఒక విందు. వంద ఉపన్యాసాలు వివరించ లేనిది ఒక పాట గొప్ప చైతన్యాన్ని తెస్తది. దాన్ని ఈ తరం కళ్ళారా చూడగలిగింది. తెలంగాణా అస్థిత్వాన్ని ప్రశ్నిచిన ప్రతిసారీ నేనున్నా అంటూ ప్రజలను ఏకం చేసింది. ఈ పాటలు ఎవరో ఒక గొప్ప రచయిత నో లేక పెద్ద పాటగాడో రాసి పాడినైగావు, మన లాంటి మామూలు పోరగాళ్ళు, సదువు రాని పెద్ద మనుసులు రాసినయే ఎక్కువ ఉంటై. అలాంటి పాటలను ఈ ఇంటర్నెట్ ప్రపంచానికి చూపించాలన్న చిన్న కోరికతో ఈ పేజీ ని మెదలు వెడ్తున్న. నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తరనుకుంటున్న.
జై తెలంగాణా , జోహార్ తెలంగాణా అమర వీరులకు జోహార్.. జోహార్...
ఇట్లు
ఒక తెలంగాణా పాట ప్రియుడు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి